NHRC Files Case: డబ్బు ఆశ చూపించి నిరు పేదలను ఉచ్చులోకి లాగుతూ క్లినికల్ ట్రయల్స్ పేర వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్(Dr. Reddy’s Labs)పై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC Files Case) కేసులు నమోదు చేసింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన నిరక్షరాస్యుల కుటుంబాలకు డబ్బు ఇస్తామని చెప్పి బాలానగర్ కేంద్రంగా జీవన్ సైంటిఫిక్ టెక్నాలజీ సంస్థ వారిపై క్లినికల్ పరీక్షలు జరుపుతున్నది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపాంకర్ డే అనే దినసరి కూలీకి ఇలాగే 15వేల రూపాయలు ఇచ్చి అతనిపై క్యాన్సర్ మందులను ప్రయోగించింది.
Also Read: PM Modi: భారత్‌తో వాణిజ్య చర్చలు.. ట్రంప్ పోస్టుకు.. ప్రధాని ఆసక్తికర ఆన్సర్!
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
పరీక్ష వికటించడంతో అతను గుండెపోటుకు గురయ్యాడు. అయినా జీవన్ సైంటిఫిక్ టెక్నాలజీ సంస్థ వర్గాలు వైద్య సహాయం కూడా అందించలేదు. ఒక్క దీపాంకర్ డే కాకుండా ఈ సంస్థ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారంటూ ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పరిహారం అడిగితే బాధితులపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని లాడ్జీలను కేంద్రంగా చేసుకుని ఈ అక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌పై కేసులు (నెంబర్ 21785/ఐఎన్/2025) నమోదు చేసింది.