Actress Krithi Shetty Interview On Ahead Release Of Manamey: ఉప్పెన మూవీతో బేబమ్మగా టాలీవుడ్ ఆడియెన్స్ హృదయాల్లో చెరిగిపోని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కృతిశెట్టి. త్వరలోనే మనమే మూవీతో ఆడియెన్స్‌ని అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అని హోస్ట్ అడగ్గా నా పనితో రిలేషన్‌లో ఉన్నా అంటూ నవ్వులు పూయించారు. కాబోయేవాడు ఎలా ఉండాలన్న ప్రశ్నపై స్పందిస్తూ.. నిజాయతీ, ఇతరులపై దయ కలిగి ఉండాలన్నారు.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. డ్యాన్స్ చేయడమంటే నాకు బాగా ఇష్టం. యాక్షన్ కూడా నచ్చుతుంది. హీరోల్లో రామ్ చరణ్ అభిమానిని. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని బదులిచ్చింది. ఆడియెన్స్‌ను అలరించే అన్ని అంశాలు మనమే మూవీలో ఉన్నాయి. నేనిందులో సుభద్ర అనే యువతిగా కనిపిస్తా. పాత సినిమాల్లో చేసిన పాత్రల్ని మరిచిపోయి ఇందులో నటించమని చెప్పారు దర్శకుడు. ఈ రోల్ ట్రావెల్ చాలా తృప్తినిచ్చింది.
Also Read: కొత్త ప్రపంచం అంటూ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
నేను చిన్నారికి తల్లిగా కనిపిస్తానా? లేదా? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా, సినిమాకీ వైవిధ్యాన్నే కోరుకుంటా. చేసిన రోల్స్ మళ్లీ మళ్లీ చేయడం నాకు నచ్చదని తెలిపారు. శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనమే. ఈ మూవీ జూన్ 7న రిలీజ్ కానుంది.