PM Modi (Image Source: twitter)
జాతీయం

PM Modi: భారత్‌తో వాణిజ్య చర్చలు.. ట్రంప్ పోస్టుకు.. ప్రధాని ఆసక్తికర ఆన్సర్!

PM Modi: గత కొన్నేళ్లుగా మిత్ర దేశాలుగా ఉంటూ వస్తున్న భారత్ – అమెరికా మధ్య ఇటీవల ఎన్నడూ లేనంతగా ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రతీకార సుంకాలకు భారత్ దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ప్రధాని మోదీ ఎప్పటికీ తనకు స్నేహితుడే అంటూ మాట్లాడారు. అంతేకాదు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయంటూ మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రధాని మోదీ ఈ  పోస్టును షేర్ చేస్తూ నెట్టింట ఆసక్తికర సమాధానం చేశారు.

ప్రధాని మోదీ ఏమన్నారంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య చర్చలపై పోస్ట్ చేయగా దానికి ప్రతిస్పందిస్తూ మోదీ స్పందించారు ‘భారత్, అమెరికా మంచిస్నేహితులు, సహజ భాగస్వాములు. ఈ వాణిజ్య చర్చలు రెండు దేశాల భాగస్వామ్యంలోని అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడానికి మార్గం సుగమం చేస్తాయని నాకెంతో నమ్మకం ఉంది. మా బృందాలు వీలైనంత త్వరగా ఈ చర్చలు ముగిసేలా కృషి చేస్తున్నాయి’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.

‘కలిసి కృషి చేద్దాం’
అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ‘రెండు దేశాల ప్రజల భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా, సుభిక్షంగా ఉండేందుకు కలిసి కృషి చేద్దాం’ అని అన్నారు. ఈ మేరకు ట్రంప్ పెట్టిన పోస్ట్ ను ప్రధాని షేర్ చేశారు. మరోవైపు ట్రంప్ సైతం మోదీ పెట్టిన పోస్ట్ ను.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ లో షేర్ చేశారు. ఇరువురు నేతల మధ్య జరిగిన ఈ సంభాషణ.. ఉద్రిక్తతలను చల్లార్చే క్రమంలో పడిన కీలక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.

4 సార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్!
అంతకుముందు ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేసినప్పటికీ ప్రధాని మోదీ స్పందిచలేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. భారత్ పై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలపై ఈ విధంగా న్యూ దిల్లీ ఆగ్రహం వ్యక్తం చేసిందని అభిప్రాయపడ్డాయి. ఆ తర్వాతనే ప్రధాని మోదీ చైనా పర్యటన.. అధ్యక్షుడు జిన్ పింగ్ తో పాటు రష్యా ప్రెసిడెంట్ తో కీలక చర్చల నేపథ్యంలో ట్రంప్ దిగొచ్చినట్లు తెలుస్తోంది.

అడ్డంకులు తొలగుతాయి: ట్రంప్
మంగళవారం ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ లో భారత్‌తో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని ప్రకటించారు. ‘భారత్, అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించడం నాకు ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీని అత్యంత మంచి స్నేహితుడుగా అభివర్ణిస్తూ త్వరలో ఆయనతో మాట్లాడాలని ఎదురుచూస్తున్నానని అన్నారు. రెండు గొప్ప దేశాలకు సానుకూల ఫలితం వచ్చేలా చర్చలు విజయవంతం అవుతాయనే నాకెంతో విశ్వాసం ఉంది’ అని కూడా పేర్కొన్నారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ..
అంతకుముందు శుక్రవారం వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘నేను ఎప్పటికీ మోదీ స్నేహితుడిగానే ఉంటాను. ఆయన గొప్ప ప్రధానమంత్రి’ అని ట్రంప్ తెలిపారు.’భారత్-అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Wine Mart: మందుబాబులకు గుడ్ న్యూస్.. అనంతగిరిలో వైన్ మార్ట్..!

ఈయూను రెచ్చగొడుతున్న ట్రంప్
భారత్‌తో చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని ట్రంప్ ప్రకటించినప్పటికీ మరోవైపు యూరోపియన్ యూనియన్‌ను భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు విధించమని ట్రంప్ కోరారు. రష్యా చమురు దిగుమతులపై భారత్, చైనా వంటి దేశాలను శిక్షించేందుకు 50% నుండి 100% వరకు సుంకాలను పరిశీలించవచ్చని ఆయన సూచించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. గత నెలలో ట్రంప్, భారత వస్తువులపై సుంకాలను రెండింతలు చేసి 50%కి పెంచారు. అంతేకాకుండా రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు కారణంగా 25% అదనపు సుంకం కూడా విధించారు.

Also Read: KCR: కవిత లొల్లితో కేసీఆర్‌‌కి చిక్కులు.. సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి..?

Just In

01

MLA Dr. Rajesh Reddy: సమాజానికి సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Army Recruitment Rally: యువతకు గుడ్ న్యూస్.. హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. వివరాలు ఇవే!

Allu Arjun- Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అట్లీ

MLA Raja Singh: కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాజాసింగ్.. బీజేపీ మీవల్లే నాశనమైదంటూ..

Kambalapalli Lake: గుట్టల నడుమ కాకతీయులనాటి కంబాలపల్లి చెరువు.. దీని ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే!