KCR: పదేళ్లు రాష్ట్రంలో రాజ్యమేలిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సొంత కూతురునుంచి ఛేదు అనుభవం ఎదురవుతోంది. గత కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న లొల్లి ఆ కుటుంబాల్లో చీలకను తీసుకొచ్చింది. డైలీ సీరియల్ తరహాలో రోజుకో విమర్శ చేస్తూ కంట్రావర్సీకి కేరాఫ్ గా మారారు. ఇది బీఆర్ఎస్(BRS) పార్టీతో పాటు కేసీఆర్(KCR) కుటుంబంలోని వ్యక్తులపై ప్రభావం చూపుతోంది. ఇదే అంశంపై తాజాగా ఓటా అనే సంస్థ సర్వే నిర్వహించగా ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు వెయ్యి శాంపిల్స్ చేసిన సర్వేలో 34శాతం మంది కవిత లొల్లికి ఇంటిగొడలే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో 20శాతం మంది కవిత(Kavitha) వెనుక రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నాడని వెల్లడించగా, మిగతా వాళ్లు ఆమె రాజకీయంగా లబ్దిపొందేందుకే విమర్శలు చేస్తున్నారని స్పష్టం చేశారు.
కవిత వైపే ఎక్కువ మంది
ఈ సర్వేలోనే లిక్కర్ కేసు(Liquor case)తో కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆ కుటుంబంలో గ్యాప్ వచ్చిందని ఆ సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఇవన్నీ కాంగ్రెస్(Congress) పార్టీకి మేలేజ్ చేకూర్చేలా ఉన్నట్లు సర్వే సంస్థ వివరించింది. పైగా సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్(BRS) నేతలకంటే కవిత వైపే ఎక్కువ మంది నెటిజన్లు నిలువడం గమనార్హం. హస్తం పార్టీకి లబ్దిని చేకూర్చేందుకు ఆమె వ్యవహారశైలీ ఉందనే కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు కూడా ఆమె వ్యాఖ్యలపై సపోర్టుగా కామెంట్లు పెడుతున్నాయి. ఈ వివాదాల్లో కవిత ఏమేరకు పాసు అవుతారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?
వివరణ తీసుకోకుండానే సస్పెండ్..
గులాబీ నేతలు అనుసరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్రంగా స్పందించారు. ఘాటు విమర్శలు చేశారు. పార్టీలో కీలకనేతలతో పాటు రిలేటీవ్స్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు(harish Rao), మాజీ ఎంపీ సంతోష్ రావు(Santhosh Rao)తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపైనా విమర్శలు చేశారు. ఈ విమర్షలతో పార్టీని ఓ కుదుపు కుదిపింది. అసలు పార్టీలో ఏం జరుగుతుంది.. కవిత ఎందుకు విమర్శలు చేశారు.. నిజంగా ఆస్థాయిలో పార్టీపై కుట్ర జరుగుతుందా? అనేది పార్టీకేడర్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చజరిగింది. దీంతో కవిత(Kavitha)ను పార్టీ అధిష్టానం వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేసింది. కవిత సైతం ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై ఓ ప్రైవేటు సంస్థ సర్వే నిర్వహించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపింది.. బీఆర్ఎస్(BRS) పార్టీని ఎంత డ్యామేజ్ చేసిందనేది హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Telangana Temples: రాష్ట్రంలో ఆలయాలకు ఆధ్యాత్మిక వైభవం.. రూ.2,200 కోట్లు విడుదల