Mahabubabad District: జిల్లాలో వేగంగా పారదర్శకంగా కొనసాగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లా యంత్రాంగం వ్యవసాయ పోలీస్(Police) సంబంధిత అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పక్కా ప్రణాళికతో యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. శనిగపురం, ఎర్రబెల్లి గూడెం, మహబూబాబాద్ శనిగాపురం పిఎసిఎస్ కేంద్రాలలో స్వయంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి మరియన్న, సంబంధిత సిబ్బంది యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ప్రాథమిక సహకార సొసైటీలో
మరిపెడ, నరసింహుల పేట కేంద్రాలలో రెవిన్యూ డివిజనల్ అధికారి గణేష్, ప్రత్యేక అధికారి డా. కిరణ్ కుమార్, జయచంద్ర, వ్యవసాయ రెవెన్యూ సంబంధిత సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. పెద్ద వంగర, డోర్నకల్ కేంద్రాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, గూడూరు మండల కేంద్రం లో ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. గార్ల మండల ప్రాథమిక సహకార సొసైటీలో ప్రత్యేక అధికారి హరిప్రసాద్, తాహసిల్దార్ శారద కూడా పర్యవేక్షిస్తున్నారు. బయ్యారం మండలంలో ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తాహసిల్దార్ నాగరాజు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చూస్తున్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో ప్రత్యేక అధికారిని కృష్ణవేణి, సంబంధిత సిబ్బంది తో కలిసి యూరియా పంపిణీ (అమ్మకాలను) స్వయంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Panchayat Elections: స్థానిక ఎన్నికలకు గద్వాల జిల్లా సర్వం సిద్ధం
అన్ని విభాగాల సిబ్బందితో
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్(Advait Kumar Singh) ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సహకార ఆగ్రోస్ ప్రైవేట్ కేంద్రాల(Agros Private Centers) ద్వారా రైతులకు యూరియా అమ్మకాలను క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా పారదర్శకంగా అమ్మకాలను కొనసాగించుటకు ప్రత్యేక అధికారులను నియమించి అన్ని విభాగాల సిబ్బందితో ముందుకు సాగుతున్నామని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల అన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరికి ఏరియా అందించడం కోసం ప్రత్యేక ప్రణాళిక, కార్యచరణ ద్వారా ముందుకు సాగుతున్నామన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయమే ప్రత్యేక అధికారులు తహసిల్దారులు వ్యవసాయ శాఖ అధికారులు ఎంపీడీవో(MPDO)లు అన్ని విభాగాల సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాల వద్ద విధులలో ఉండి అమ్మకాలను సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రస్తుతం కేంద్రాల లో ఉన్న స్టాక్ వివరాలు ప్రతి ఒక రైతుకు సమాచారం అందిస్తూ ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
Also Read: Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు