Hyderabad Collector ( iMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Hyderabad Collector: హైదరాబాద్ (Hyderabad )జిల్లాలోని చాకలి ఐలమ్మ మహిళా వర్శిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Harichandana Dasari) అధికారులను ఆదేశించారు.  యూనివర్సిటీని సందర్శించిన ఆమె తెలంగాణ కే తలమానికంగా ఉండడంతో నూతన భవనాల నిర్మాణాలు, పాత భవనాల పునరుద్ధరణ, తదితర అంశాలపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి యూనివర్సిటీ దర్బార్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Hyderabad Collector) మాట్లాడుతూ నూతన భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని , రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శినికత, ఆలోచనలకు అనుగుణంగా విశ్వ విద్యాలయ అభివృద్ధి, అలాగే మహిళా శక్తిని మరింతగా ప్రోత్సహించడం జరుగుతుందని వివరించారు.

 Also Read: Hyderabad Task Force: రద్దయిన కరెన్సీ మార్పిడికి యత్నం.. గ్యాంగ్ అరెస్ట్ 1.92 కోట్లు సీజ్!

పనులను త్వరితగతిన చేపట్టాలి

నూతన భవనాల నిర్మాణాలతో పాటు పాత భవనాల పునరుద్ధరణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నందున నిర్దేశించిన సమయానికి పనులను పూర్తిచేయాలని, ఎక్కడ కూడా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో పనులు ఉండాలని సూచించారు. అలాగే పనుల పరిశీలనకై నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. యూనివర్సిటీలోని నూతనంగా చేపట్టే అకాడమిక్ బ్లాక్, హాస్టల్, ఆడిటోరియం, స్పోర్ట్స్ బ్లాక్, గెస్ట్ హౌస్ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.

విద్యార్థుల సంఖ్య 7 వేలకు పైగా

పాత భవనాల పునరుద్ధరణ లో భాగంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ బ్లాక్స్ లను కూడా ఆమె సందర్శించారు. ఆ తర్వాత యూనివర్సిటీలోని విద్యార్థుల సంఖ్య 7 వేలకు పైగా ఉందని, వసతి గృహంలో దాదాపు వెయ్యికి పైగా విద్యార్థులుంటున్నారని, వివిధ విభాగాలలో అధ్యాపకులు ఐదు వందల వరకున్నారని కలెక్టర్ కు ప్రిన్సిపాల్ వివరించారు. ఆ తర్వాత కలెక్టర్ రంగ్ మహల్, సిమెంట్రీ, హెజ్రా హౌస్ ప్రాంతాలలోని పురాతన భవనాలను పరిశీలించారు. ఈ సందర్శనలో ప్రిన్సిపాల్ డాక్టర్ లోక పావని, ఆర్డీఓ రామకృష్ణ, ఈ ఈ అనిత, డీఈ ఆశీర్వాదం, డాక్టర్ అరుణ, డాక్టర్ విజయలక్ష్మి, వివిధ విభాగాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: K-Ramp Movie Song: ‘కె ర్యాంప్’ సినిమా నుంచి లిరికల్ వచ్చేసింది.. వారి కెమిస్ట్రీ కుదిరిందిగా..

Just In

01

KCR: కవిత లొల్లితో కేసీఆర్‌‌కి చిక్కులు.. సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి..?

Warangal District: జాతీయ లోక్ అదాలత్‌తో.. కేసుల పరిష్కారానికి కృషి!

Crime News: చికిత్స పొందుతున్న యువతి పై అఘాయిత్యం.. నిందితుడు అరెస్ట్.. ఎక్కడంటే..?

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?