Super Star Rajinikanth Movie Vettayan Vs Junior NTR devara Movie
Cinema

Devara Movie: ఎన్టీఆర్‌ మూవీకి రజినీ మూవీ సవాల్‌

Super Star Rajinikanth Movie Vettayan Vs Junior NTR devara Movie:టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ని సోలో హీరోగా చూసి నాలుగేళ్ళు దాటింది. ఈ నేపథ్యంలో ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఫ్యాన్స్‌కి దేవర మూవీ రిలాక్స్‌ తెప్పించింది. అక్టోబర్ 10 దేవర మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది కొన్ని నెలల క్రితమే అఫీషియల్‌గా డేట్‌ ఫిక్స్ చేశారు. దానికి అనుగుణంగానే డైరెక్టర్ కొరటాల శివ లేట్‌ చేయకుండా షూటింగ్ చేస్తున్నారు. టైటిల్ సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ అయ్యింది. త్వరలో మరో మెలోడీ సాంగ్‌ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

రిలీజ్‌కి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ ప్రమోషన్ విషయంలో ఇప్పటి నుంచే కేర్‌ తీసుకుంటూ పాన్ఇండియా రేంజ్ హైప్ వచ్చేలా చూసుకుంటున్నారు. అన్ని భాషల్లో సమాంతరంగా భారీ రిలీజ్ దక్కాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. అయితే అదే టైమ్‌కి సూపర్ స్టార్ రజనీకాంత్ బిగ్ ట్విస్ట్‌ ఇచ్చేలా ఉన్నారు. టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయన్‌ని అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ డిసైడ్ అయిందని టాక్. దసరా పండగకు లక్ష్యంగా చేసుకుని గత ఏడాది జైలర్ లాగే ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలనేది తలైవా మేకర్స్ ప్లాన్. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీకి వచ్చే ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు. కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రాష్ట్రాల్లో ఖచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది.

Also Read: థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్ డేట్‌

దేవరకు సరిపడా హైప్ ఉన్నా సరే పక్క రాష్ట్రాల్లో రజనితో ధీటుగా స్క్రీన్ కౌంట్ తెచ్చుకోవడం సులభంగా ఉండదు. పైగా సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ కాబట్టి పంపిణి వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. నిజానికి ఎవరో ఒకరు దేవరకు కాంపిటీషన్ వస్తారని తెలుసు. కానీ ఇలా రజనితోనే తలపడాల్సి రావడం ఊహించని పరిణామం. సెప్టెంబర్‌లో విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్, ఆపై నెల తిరక్కుండానే వెట్టయాన్ రావడం పట్ల కోలీవుడ్ ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. టాలీవుడ్‌లో ఇంకా టైటిల్ నిర్ణయించని రజిని మూవీలో రానా, అమితాబ్ బచ్చన్ తదితరుల కీలక పాత్రలతో పాటు అనిరుద్ బాణీలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారుతోంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!