Attack On Minister: నేపాల్‌లో జెన్ జెడ్ (Gen Z) తరం ఆందోళనకారుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా, హింసాత్మకంగా మారాయి. మంగళవారం ప్రధానమంత్రి, రాష్ట్రపతి నివాసాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న మంత్రులపై కూడా తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. మంగళవారం నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు ఏకంగా దేశ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను (Attack On Minister) కాట్మాండ్ నగరంలోని ఓ వీధిలో పరిగెత్తించి కొట్టారు. వీధిలో తరిమికొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
65 ఏళ్ల వయసున్న ఆర్థిక మంత్రి పౌడెల్ కాట్మాండు నగరంలోని ఓ వీధిలో పరిగెడుతూ వైరల్ వీడియోలో కనిపించారు. నిరసనకారులకు భయపడి ఆయన పెరిగెడుతుండగా, అకస్మాత్తుగా ఒక యువకుడు వచ్చి గాలిలోకి జంప్ చేసి కాలితో మంత్రిని తన్నాడు. దెబ్బ బలంగా తగలడంతో ఆయన వెళ్లి పక్కనే ఉన్న గోడకి బలంగా తగిలారు. అయినప్పటికీ మంత్రి ఫౌడెల్ వెంటనే లేచి తిరిగి పరుగు లంకించుకున్నారు. నిరసనకారులు కొట్టకుండా ఓ వ్యక్తి అడ్డుపడే ప్రయత్నం చేయడం కూడా వీడియోలో కనిపించింది.
సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేయాలని, అవినీతిని రూపుమాపాలనే ప్రధాన డిమాండ్లతో సోమవారం మొదలైన ఈ నిరసనలు, నిషేధం ఉపసంహరించినప్పటికీ మంగళవారం కూడా కొనసాగాయి. మంగళవారం కర్ఫ్యూ విధించినప్పటికీ అనేక సమూహాలు నిబంధనలను ధిక్కరించాయని, నగరంలోని చాలా ప్రాంతాల్లో నిప్పుపెట్టిన ఘటనలు, దాడులు నమోదయ్యాయని కాట్మాండూ పోలీసు అధికారి శేఖర్ ఖనాల్ వెల్లడించారు.
Read Also- Shocking Case: అడవిలో ఓ వివాహిత, ఆమె ఫ్రెండ్ మృతదేశాల గుర్తింపు.. కాల్ రికార్డ్స్ పరిశీలించగా..
ప్రధాని ఓలీ రాజీనామా
జెన్ జెడ్ తరం యువత నిరసనలకు నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ శర్మ మంగళవారం రాజీనామా చేశారు. దేశంలో అశాంతి దృష్ట్యా పదవి నుంచి దిగిపోవాలంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ కోరడంతో ఆయన తప్పుకున్నారు. నేపాల్‌కు నాలుగవసారి ప్రధానమంత్రి గతేడాదే ఆయన ప్రమాణస్వీకారం చేశారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఆయన, మిత్రపక్షంతో కలిసి గద్దెనెక్కారు. ప్రభుత్వంపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా 26 సోషల్ మీడియా మాధ్యమాలపై కేపీ ఓలీ శర్మ ప్రభుత్వం నిషేధం విధించడంపై అక్కడి యువత ఆగ్రహ జ్వాలలతో కదంతొక్కారు. సోమవారం భారీ ఎత్తున నిరసనలు ఎగసిపడగా, ఆందోళనల నియంత్రణ కోసం ప్రభుత్వం ఏకంగా కాల్పులకు పాల్పడింది. సోమవారం ఒక్క రోజే ఏకంగా 19 మంది చనిపోయారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నిరసనకారుల ఆగ్రహం తగ్గలేదు. మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. దీంతో, పెద్ద సంఖ్యలోనే నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు మంత్రులు రాజీనామా చేశారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు పదవులకు రాజీనామా చేస్తున్నారు.
Read Also- Suryakumar Yadav: ప్రెస్‌మీట్‌లో పాక్ కెప్టెన్ మినహా అందరికీ షేక్‌హ్యాండ్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్
టిక్‌టాక్‌లో వీడియోలు వైరల్
నేపాల్ నెలకొన్న అసమానతలను వీడియోల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు నిరసనకారులు. దేశంలో రిజిస్టర్ కాలేదనే కారణాన్ని చూపిస్తూ ఏకంగా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధిస్తూ కేపీ ఓలీ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ జాబితాలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి అనేక పాపులర్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే టిక్‌టాక్‌ను మాత్రం నిషేధించలేదు. దీంతో, నేపాల్ ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు లగ్జరీ బ్రాండ్లు దుస్తులు, ఖరీదైన విహారయాత్రల్లో పాల్గొంటున్న వీడియోలు ఒకవైపు… మరోవైపు సాధారణ నేపాలీల జీవిత కష్టాలను చూపించే వీడియోలతో పోల్చుతూ అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోలే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు, నిరసనలకు దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
🇳🇵 Nepal’s Finance Minister gets beaten in the streets by protesters.
Protesters have also set fire to the countries Parliament and forced the resignation of the communist Prime Minister in protest to corruption and social media restrictions.
— Oli London (@OliLondonTV) September 9, 2025