Indian Railways: రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని చర్లపల్లి నుంచి బిహార్ లోని ససారాం వరకూ 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు 2025 సెప్టెంబర్ 11 నుండి నవంబర్ 21 వరకు నడుస్తాయని స్పష్టం చేసింది. రైలులో దూర ప్రయాణం చేయాలనుకునేవారికి ఇవి ప్రయోజనం చేకూరుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అభిప్రాయపడింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..
చర్లపల్లి నుంచి ససారాం (Charlapalli–Sasaram)కు ప్రతి గురువారం (సెప్టెంబర్ 11 – నవంబర్ 20 మధ్య) 07021 నెంబర్ గల రైలు నడవనుంది. అలాగే ససారాం నుంచి చర్లపల్లికి ప్రతీ శుక్రవారం (సెప్టెంబర్ 12 – నవంబర్ 21 వరకు) 07022 నెంబర్ రైలు తిరగనుంది. మెుత్తం 11 సర్వీసుల్లో 22 ప్రయాణాలు ఈ ప్రత్యేక రైళ్లు చేయనున్నాయి.
రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచి జనగామా, కాజీపేట్, పెదపల్లి, రామగుండం, సిర్పూర్, కాగజ్‌నగర్, బాల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిప్పారియా, మదన్ మహల్, కట్నీ, సత్నా, మాణిక్పూర్, ప్రయాగ్‌రాజ్ ఛేహోకి, దిన్ దయాళ్ ఉపాధ్యాయ్, భాబువా రోడ్ వంటి ప్రధాన స్టేషన్ల వద్ద ఆగుతూ వెళ్లనుంది.
Also Read: Kajal Aggarwal: ” నేను బతికే ఉన్నాను ” చంపేయకండి.. ఆ వార్తల పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రైళ్లలో కోచ్ వివరాలు..
సాధారణంగా ప్రతీ రైళ్లల్లో ఉన్నట్లు ఈ ప్రత్యేక ట్రైన్స్ లో కూడా 1 AC, 2AC, 3AC కోచ్‌లు ఉండనున్నాయి. స్లీపర్ బెర్తులు సైతం బుక్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది.
Also Read: Group 1 Exams: హైకోర్టు సంచలన తీర్పు.. గ్రూప్-1 ఫలితాలు రద్దు.. మళ్లీ మెుదటి నుంచి!
అధికారుల సూచనలు
చర్లపల్లి – ససారాం మధ్య నడిచే ప్రత్యేక రైలులో ప్రయాణించదలిచిన వారు.. ముందుగానే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. పండుగ సీజన్‌లో అదనపు రైళ్లు నడపడం ద్వారా ప్రయాణికులు భద్రంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే దసరా, దీపావళి, ఛఠ్ పూజా వంటి పండుగల నేపథ్యంలో ఈ రైళ్ల సర్వీసును నడుపుతున్నట్లు వివరించారు.