Mahabubabad District: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. లేచిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఒక్క బస్తా కోసం లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుల బాధలను సైతం అర్థం చేసుకున్న మహబూబాబాద్(Mahabubabad) జిల్లా ఎస్పీ వారి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా యూరియా(Urea) పంపిణీ కేంద్రాలను సందర్శించి అక్కడ రైతులకు సజావుగా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని ఆదేశిస్తూ వస్తున్నారు. సోమవారం సైతం ఉదయాన్నే మహబూబాబాద్ జిల్లా లోని పిఎసిఎస్ కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు కావాల్సిన యూరియాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
రైతులు కొన్నిచోట్ల లైన్లో నిలబడి
మంగళవారం సైతం ఉదయాన్నే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కంకర బోర్డ్ కాలనీలో ఉన్న పిఎసిఎస్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడకు చేరుకున్న యూరియా బస్తాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులు, రైతులు కొన్నిచోట్ల లైన్లో నిలబడి అస్వస్థతకు గురవుతున్నారని ఈ నేపథ్యంలో యూరియా పంపిణీ కేంద్రాల్లో మంచినీటి వసతి, ఇతర సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Also Read: AAI Recruitment 2025: AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025..
ఇబ్బందులు లేకుండా పంపిణీ
గత రెండు నెలలుగా యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులకు యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించాలని సూచించారు. జిల్లాలో ఎక్కువ నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు, మహిళా రైతులు క్యూ లైన్ లలో నిలబడుతున్న క్రమంలో వారికి నీడ కల్పించేందుకు టెంట్లను వేయాలని తెలిపారు. అవసరమైతే క్యూ లైన్ లలో నిలబడిన వారికి మంచినీటితోపాటు మజ్జిగ ప్యాకెట్లను అందించాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. యూరియా(Urea) పంపిణీ కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అస్వస్థత చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశిస్తున్నారు.
Also Read: Viral Video: కెనడా మెట్రో స్టేషన్‌లో.. అలాంటి పని చేస్తూ.. కెమెరాకు చిక్కిన ఇండియా అమ్మాయి