Mahabubabad District: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు సమస్య మరింత జటిలం అవుతూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావాల్సినంత యూరియా అందుబాటులోకి రాకపోవడంతో రైతన్నలు చేలల్లో పనిచేసుకోవాల్సి ఉండగా రహదారుల పైకి వచ్చి యూరియా కష్టాలు పడుతున్నారు. ఆదివారం మహబూబాబాద్(Mehabubabad) జిల్లా కేంద్రం శివారు శనగపురం లో పోలీసుల బందోబస్తు మధ్య రైతులకు యూరియా(Urea) బస్తాల కోసం టోకెన్లను పంపిణీ చేస్తున్నారు. ఏరియా బస్తాల టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు.
Also Read; Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?
అధికారులు అప్రమత్తం.. యూరియా ఆగడం లేదు
జిల్లా పోలీస్ బాస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్వయంగా రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేసిన యూరియా లొల్లి మాత్రం ఆగడం లేదు. రైతులకు అందాల్సిన యూరియా సకాలంలో అందకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత రెండు రోజులుగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్(SP Sudhir Ramnath) కేక పిఎసిఎస్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సందర్శించి యూరియా(Urea) కొరతపై పర్యవేక్షిస్తున్నారు. రైతులకు కావాల్సిన యూరియాను సాధ్యమైనంత త్వరగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచనలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం స్వయంగా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి పిఎసిఎస్ కేంద్రం వద్ద రైతులకు బస్తాలను పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం శనిగాపురం గ్రామంలో అధికారులు అందించే టోకెన్ ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు
వ్యవసాయ అధికారుల ద్వారా మహబూబాబాద్ మున్సిపాలిటీ శివారు శనగపురం గ్రామంలో ఏరియా బస్తాలు అందించేందుకు రైతులకు టోకెన్ ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో డిఎస్పి ఎన్ తిరుపతిరావు(DSP Thirupati Rao), రూరల్ ఎస్సై దీపికా రెడ్డిలతో కలిసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచనలు చేశారు. లైన్లో వేచి ఉన్న రైతులు సంయమనం పాటించాలని వివరించారు.
Also Read: Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!