Hero Dog: పెరూ దేశంలో ఆశ్చర్య ఘటన చోటుచేసుకుంది. 25 పౌండ్ల బరువున్న ఓ కుక్క.. బాంబ్ బ్లాస్ట్ జరగకుండా అడ్డుకొని తన కుటుంబాన్ని కాపాడింది. తద్వారా స్పానియల్ జాతి కుక్క మాచిస్ తన కుటుంబాన్ని రక్షించిన రియల్ హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. డాగ్ లవర్స్ ఈ శునకాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇది కదా విశ్వాసం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
పత్రికా రచయిత కార్లోస్ అల్బెర్టో మెసియాస్ జరాటే (Carlos Alberto Mesias Zarate) ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ అగంతుకుడు.. ఇంటి ప్రహారిలోకి వెలిగించిన డైనమైట్ ను విసిరాడు. సాధారణంగా కొండలను బద్దలు కొట్టేందుకు ఈ పవర్ ఫుల్ పేలుడు పదార్థాన్ని ఉపయోగిస్తారు. అటువంటి డైనమైట్ ను విసిరి.. ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. .
నోటితో ఫ్యూజ్ కొరికి నిర్వీర్యం
అదే సమయంలో ఆ ప్రహరీ వద్దనే ఉన్న పెంపుడు శునకం మాచిస్ (Machis).. డైనమైట్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. దానిని నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లి.. చివరికి తన నోటితో మండుతున్న ఫ్యూజ్ ను కొరికేసింది. దీంతో నిప్పు ఆరిపోయి.. పెను ప్రమాదం తప్పింది. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ డైనమైట్ ను ల్యాండ్ మైన్ లలో వాడే రకంగా ధ్రువీకరించారు.
Security footage shows a family dog, named Manchis, barking as an unknown attacker dropped an explosive device into the yard of a journalist’s home in Huaral, Peru. The dog eventually diffuses the stick of dynamite.
The media company where Zarate works, Central de Noticias,… pic.twitter.com/cLFBP8pjoV
— CBS News (@CBSNews) September 5, 2025
ఇంటి యజమాని ఏమన్నారంటే?
కుక్క యజమాని జరాటే మాట్లాడుతూ.. మాచీస్ కారణంగానే తమ కుటుంబం పెను ప్రమాదం నుంచి బయటపడగల్గిందని అన్నారు. కుక్క నేరుగా డైనమైట్ కొరికినందువల్లే ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు. ఫ్యూజ్ మాచిస్ నోటిలోనే ఆరిపోయిందని స్పష్టం చేశారు. దీంతో ఇంట్లో వారికి ఎలాంటి హానీ జరగలేదని చెప్పారు.
శునకం గొంతుకు గాయం
డైనమైట్ ఫ్యూజ్ కొరుకుతున్న సమయంలో మాచిస్ గొంతుకు గాయమైందని జరాటే తెలిపారు. దీంతో ఇంతకుముందు లాగా మెురగలేకపోతోందని వాపోయారు. అయితే శారీరకంగా మాచీస్ ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఘటన తర్వాత మాచీస్ స్థానికంగా ఒక సెలబ్రిటీగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఈ శునకాన్ని ‘పెరూ లోని అతి ధైర్యవంతమైన కుక్క’ అని ప్రశంసిస్తున్నారు.
అగంతుకుడు అరెస్ట్
మరోవైపు ఇంటిపై డైనమైట్ ను విసిరిన వ్యక్తిని పెరూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే జరాటే పత్రికా వృత్తిలో ఉన్నందున అతడ్ని భయపెట్టేందుకు ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Also Read: Hyderabad News: జీడిమెట్లలో సామాజిక కార్యకర్త అరుదైన ఆలోచన.. ప్రాణానికి కవచం గా ‘గో స్లో’ నినాదం..?
ఈ కుక్కలు సైతం..
స్విట్జర్లాండ్‌లో ఒక చిహువాహువా కుక్క తన యజమాని లోయలో పడిపోయిన చోటుని వదిలి వెళ్లకుండా ఉండటంతో రక్షక బృందం అతన్ని కనుగొనగలిగింది. అమెరికాలో పలు పెంపుడు కుక్కలు ఇళ్లల్లో అగ్ని ప్రమాదాలను గమనించి యజమానులను రక్షించాయి. మరొక సందర్భంలో ఓ కుక్క .. అడవిలో గాయపడి ఉన్న యజమాని వద్దకు రెస్క్యూ టీమ్ ను తీసుకెళ్లడంలో సాయపడింది.