Director Sukumar Sudden Twist Pushpa 2 Climax Change
Cinema

Pushpa 2: బిగ్ ట్విస్ట్‌, పుష్ప 2 క్లైమాక్స్‌ కోసం..?

Director Sukumar Sudden Twist Pushpa 2 Climax Change: తన సినిమాల విషయంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవుట్‌ ఫుట్ విషయంలో అయన ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. దానికోసం రిలీజ్ డేట్ కూడా వాయిదా పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న మూవీ పుష్ప 2.

ఈ మూవీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. గత ఏడాది చివర్లోనే రిలీజ్ కావాల్సిన పుష్ప 2 షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టు 15 కి వాయిదా పడింది. రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో బన్నీ ఫ్యాన్స్‌లో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి తరుణంలో సుకుమార్ మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. పుష్ప 2 క్లైమాక్స్‌ని ఛేంజ్‌ చేయాలని సుకుమార్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. మాములుగా సుకుమార్ తన మూవీస్‌కి రెండు క్లైమాక్స్‌లు రాసుకుంటాడు. పుష్ప 2 కోసం కూడా రెండు క్లైమాక్స్ లు ప్లాన్ చేశాడట.

Also Read: కాజల్ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌

రెండింటిలో ఒకటి యాడ్ చేయాలని భావించగా ముందుగా అనుకున్న క్లైమాక్స్ కాకుండా వేరే క్లైమాక్స్ యాడ్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2కి కొనసాగింపుగా పార్ట్ 3 కూడా చేయాలనే ఆలోచన రావడంతో సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్ కూడా పార్ట్ 3 కి సూట్ అయ్యేలా ప్లాన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే క్లైమాక్స్ పార్ట్‌ను మల్లి రీ షూట్ చేయాల్సి వస్తుంది. దానికి ఇంకాస్త టైం కావాలి. మరి రిలీజ్ డేట్‌కు ముందు కంప్లీట్‌ చేస్తారా లేక ఆ తరువాత చేస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!