CM Revanth Reddy (imagecredit:twitter)
హైదరాబాద్

CM Revanth Reddy: నేడు కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన.. ఎక్కడంటే..?

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్​ సాగర్​(Usman Sagar), హిమాయత్ సాగర్(Himayat Sagar) రిజర్వాయర్ లను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2,3 పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు శంకుస్థాపన చేయనున్నారు. రూ.7360 కోట్లతో ప్రభుత్వం హమ్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపడుతుంది.ఇందులో ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి వాటా పెట్టనుండగా, కాంట్రాక్ట్ కంపెనీ 60 శాతం నిధులు సమకూరుస్తుంది. రెండేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు.

రోజు నల్లా నీటిని సరఫరా

అందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యంలో ఉన్న 7 చెరువులను నింపుతారు. డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్(Hyderabad) తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతి రోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇక ఓఆర్ఆర్ ఫేజ్ 2 లో భాగంగా జీహెచ్ ఎంసీ(GHMC), ఓఆర్ఆర్(ORR) పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ,గ్రామ పంచాయితీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రూ.1200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించ నున్నారు.

Also Read: Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

దీంతో పాటు కోకాపేట్ లేఅవుట్

వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. సరూర్ నగర్(Sarurnagar), మహేశ్వరం(maheshwaram), శంషాబాద్(Shemshabadh), హయత్‌నగర్(Hayath Nagar), ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీ పూరం, పటాన్‌చెరు(Patancheru), బొలారం.. మొత్తం 14 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. దీంతో పాటు కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి నియో పోలీస్- సెజ్ కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే రూ.298 కోట్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రెండేండ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో 13 లక్షల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Just In

01

Wanaparthy Police: వనపర్తిలో పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

RBI Grade B Recruitment 2025: RBI‌ లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు..

Mana Shankara Vara Prasad Garu: చిరు, నయన్ పాటేసుకుంటున్నారు.. తాజా అప్డేట్ ఇదే!

Viral Video: ఏనుగులనే హడలెత్తించిన.. డాడీ లిటిల్ ప్రిన్సెస్.. మీకో దండం తల్లి!

Chris Gayle: పంజాబ్ కింగ్స్ జట్టుపై క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు