Chikoti Praveen: హైదరాబాద్ మరో పంజాబ్ గా మారే ప్రమాదం
Chikoti Praveen (imagecredit:twitter)
హైదరాబాద్

Chikoti Praveen: హైదరాబాద్ మరో పంజాబ్‌గా మారే ప్రమాదం.. చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

Chikoti Praveen: నగరంలో రూ.వేల కోట్ల డ్రగ్స్ పట్టుబడడంపై బీజేపీ నేత డాక్టర్ చికోటి ప్రవీణ్(Chikoti Praveen) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరానికి కూత వేటు దూరంలో డ్రగ్స్ కంపెనీపై మహారాష్ట్ర పోలీసులు దాడిచేశారని, అందుకే వెంటనే ఓల్డ్ సిటీలో కార్డెన్ సెర్చ్ చేపట్టాలని చికోటి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేదంటే హైదరాబాద్ మరో పంజాబ్ గా మారే ప్రమాదం ఉందన్నారు. పక్క రాష్ట్రం పోలీసులు రైడ్ చేసే వరకు మన రాష్ట్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని చికోటి ప్రశ్నించారు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతాం, గంజాయి వ్యవస్థను తరిమివేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తి ముచ్చట్లేనా? అని ఆయన చురకలంటించారు.

కాలేజీ విద్యార్థులకు సైతం డ్రగ్స్

బంగ్లాదేశ్ మహిళ ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీని నడిపిస్తోందని సమాచారం ఉందని ప్రవీణ్ పేర్కొన్నారు. ఈరోజు డ్రగ్స్ ఫ్యాక్టరీ, రేపు బాంబులు, తుపాకుల ఫ్యాక్టరీలు బయటపడ్డా ఆశ్చర్యం లేదని చికోటి వ్యాఖ్యానించారు. రోహింగ్యా, బంగ్లాదేశీయులను వెళ్లగొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. కాలేజీ విద్యార్థులకు సైతం డ్రగ్స్ సులువుగా దొరుకుతున్నాయంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. వీటన్నింటిపై పోలీసులు దర్యాప్తు జరిపి మాదకద్రవ్యాలను కంట్రోల్ చేయాలని చికోటి డిమాండ్ చేశారు. లేదంటే పంజాబ్ లాగే హైదరాబాద్ నగరం డ్రగ్స్ సిటీగా మారే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.

Also Read: Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

కేసు వివరాలు ఇలా..

గ్రేటర్ హైదరాబాద్ లో నడుస్తున్న డ్రగ్ తయారీ ఫ్యాక్టరీ గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశీ మహిళ సహా 12మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో 12కోట్ల రూపాయల విలువ చేసే మెఫెడ్రోన్ డ్రగ్, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. మీరా భయందర్ వసాయి విరార్ కమిషనరేట్ క్రైం డిటెక్షన్ యూనిట్ అధికారులు గత నెలలో బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్ల (23)ను స్థానికంగా ఉన్న మీరా రోడ్డలోని కశిమిరా బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేసి 105 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆమె డ్రగ్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ లో సభ్యురాలని వెళ్లడయ్యింది. ఈ నేపథ్యంలో మరో 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం