Pending Bills (imagecredit:twitter)
తెలంగాణ

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Pending Bills: పంచాయతీరాజ్ లో అద్దె వాహనాలకు ప్రభుత్వం బిల్లులు పెండింగ్ పెట్టింది. గత 29 నెలలుగా వాహనాలకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు 6 నెలలుగా అప్రూవల్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదని సమాచారం. దీంతో ఎంపీడీఓ(MPDO)లు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 48కోట్లు వాహనాలకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

గత ప్రభుత్వంలో 9 నెల అద్దె..

ప్రభుత్వం మండల స్థాయి అధికారులకు వాహనాల సదుపాయం కల్పిస్తుంది. ఆ వాహనాలను అద్దె(హయర్) కేటాయిస్తుంది. అయితే అందుకు ప్రభుత్వం ప్రతి వాహనానికి రూ.32వేలు చెల్లిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో 9 నెలల వరకు అద్దె వాహనాల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. దానికి తోడు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి బిల్లులు మంజూరు చేయడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీలు రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది పనిచేస్తున్నారు. వారికి కేటాయించిన అద్దె వాహనాలకు 29 నెలలుగా చెల్లించడం లేదు. దీంతో 48కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. నెలకు 32వేల చొప్పున ఒక్కో ఎంపీడీఓ అద్దె వాహనానికి 9 లక్షల వరకు రావల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని పలువురు అద్దె వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read; Allari Naresh: మత్తెక్కిస్తున్న ‘ఆల్కహాల్’ టీజర్.. పర్ఫామెన్స్ చింపేశాడు భయ్యా..

మరోవైపు అద్దె వాహనాలకు 6 నెలలుగా ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వలేదని సమాచారం. దీంతో హయర్ వెహికిల్స్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు వాహనం కొనసాగిస్తే అద్దె వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. మరోవైపు వాహనంను కొనసాగించకపోతే బకాయిపడిన అద్దె వస్తుందా? రాదా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నతాధికారులు అద్దెవాహనాల కొనసాగింపునకు అప్రూవల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

పలువురు ఆవేదన

ఇదెలా ఉంటే కొంతమంది ఎంపీడీఓలు సొంత వాహనంనే అద్దె వాహనంగా నడుపుతూ ప్రతి నెలా 32వేలు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అద్దె వాహనంగా నడుపుతున్నారనే విషయం ప్రభుత్వ దృష్టికి సైతం వెళ్లినట్లు సమాచారం. కొంతమంది హయర్ వాహనదారులు సైతం ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతోనే ప్రభుత్వం అద్దె వాహనాలకు చెల్లించాల్సిన అద్దెలను పెండింగ్ లో పెట్టిందనే ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఎంపీడీఓలు హయర్ వాహనదారులకు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. దీంతో వారికి కూడా ఆర్థిక భారం అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఎప్పటిలోగా అద్దెను చెల్లిస్తుందోనని హయర్ వాహనదారులు ఎదురుచూస్తున్నారు.

Also Read: Telugu Movies: టీచర్స్ డే రోజున చూడాల్నిన చిత్రాలు ఇవే.. తర్వాత ఏం చేయాలో తెలుసా..

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్