AI-Jobs
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

AGI impact: మనవాళి ఉద్యోగాలకు కృత్రిమమేధ పెనుముప్పుగా (AGI impact) పరిణమించబోతోందా?, ఇప్పుడున్న చాలా ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయా? అంటే, ఔననే హెచ్చరిస్తున్నారు అమెరికాలోని లూయిస్‌విల్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారిలో 99 శాతం మంది 2030 నాటికి జాబ్స్ కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకునేందుకు వేగంగా ఏఐ వ్యవస్థలను అందిపుచ్చుకుంటున్నాయని, అందుకే 2030 నాటికి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతాయని యాంపోల్స్కీ విశ్లేషించారు. కోడర్స్, ప్రాంప్ట్ ఇంజినీర్స్ వంటి హైటెక్ ఉద్యోగాలకూ భవిష్యత్తులో స్థానం ఉండకపోవచ్చని అన్నారు. కాగా, యాంపోల్స్కీ ఏఐ భద్రతా నిపుణులలో ఒకరిగా పేరొందారు.

భయంకరమైన నిరుద్యోగం!

అతి భయంకరమైన నిరుద్యోగ స్థాయిని ఎదుర్కొనబోతున్నామని, ఏదో 10 శాతం నిరుద్యోగం గురించి కాదని, ఏకంగా 99 శాతం మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని ఆయన యాంపోల్స్కీ అన్నారు. ఈ మేరకు ‘ది డైరీ ఆఫ్ ఏ సీఈవో’ అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. మనుషుల్లాంటి తెలివి, లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(AGI) 2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏఐజీ (Artificial General Intelligence) అందుబాటులోకి వచ్చిన మూడు సంవత్సరాలలోనే, ఉద్యోగ మార్కెట్ పూర్తిగా కుప్పకూలుతుందని రోమన్ యాంపోల్స్కీ హెచ్చరించారు. ఏఐ టూల్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ ఇందుకు కారణమవుతాయన్నారు. మనుషుల నియమించుకోవడం ఆర్థికపరంగా కంపెనీలకు అనవసరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఒక ఉద్యోగి చేసే పనిని కేవలం 20 డాలర్ల సబ్‌స్క్రిప్షన్ ద్వారా పూర్తి చేయించుకునే పరిస్థితి ఏర్పడితే.. అప్పుడు మనుషుల అవసరం తగ్గిపోతుంది.

Read Also- O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

ముందుగా, కంప్యూటర్‌పై చేసే పనులన్నీ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. తర్వాత, హ్యూమనాయిడ్ రోబోట్స్ రూపంలో ప్రభావం ఉంటుంది. హ్యుమనాయిడ్ రోబోట్స్ ఇంకా ఐదు సంవత్సరాలు దూరంలోనే ఉన్నాయి. అంటే, రానున్న ఐదేళ్లలో శారీరక శ్రమ అవసరం తగ్గిపోతుంది’’ అని యాంపోల్స్కీ అంచనా వేశారు. ఉద్యోగం ద్వారా ఆదాయం, జీవిత నిర్మాణం, సామాజిక గుర్తింపు, ఒక వర్గం అనే అనుభూతిని ఇస్తాయని, కానీ, ఉద్యోగాలు పోతే ఈ నాలుగు అంశాలను రూపొందించుకోవాల్సి ఉంటుందని, అది చాలా క్లిష్టమైన పని అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపని ఆటోమేట్ అయిపోయిన తర్వాత, ప్లాన్-బీ అనే ఆప్షనే ఉండదని, మళ్లీ శిక్షణ ఇచ్చినా ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు.

Read Also- Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఉద్యోగాలను ఏఐ నాశనం చేయబోతోందని యాంపోల్స్కీ మాత్రమే కాకుండా, చాలామంది ఐటీ నిపుణులు ఇదేమాట చెబుతున్నారు. కృత్రిమ మేధ(AI) ఉద్యోగ మార్కెట్‌ను తారుమారు చేయబోతుందని చాలామంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 2025 మే నెలలో, అమెరికాకు చెందిన ఏఐ కంపెనీ అంత్రోపిక్ సీఈవో డారియో అమోడై మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో, ఎంట్రీ లెవల్ వైట్-కాలర్ ఉద్యోగాలలో 50 శాతం కనుమరుగు అవ్వొచ్చని పేర్కొన్నారు. విషయం అర్థమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ ప్రమాదాన్ని తక్కువగా చూపిస్తున్నాయని ఆయన అన్నారు. ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుండడంతో నిరుద్యోగ రేటు గణాంకాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు