O Cheliya movie song: టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలు తగ్గుతున్న సమయంలో ప్రేక్షకులను ప్రేమలో ముంచెత్తడానికి రాబోతుంది ‘ఓ చెలియా సినిమా. ఇప్పటికే ఈ సినిమా అత్యంత వేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటను రాకింగ్ స్టార్ ముంచు మనోజ్ విడుదల చేశారు. ఆ పాటను విన్న తర్వాత చాలా రోజుల తర్వాత మంచి మెలొడీ ప్రేక్షకులకు అందించినందుకు అభినందనలు తెలిపారు. ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి పాటను మంచు మనోజ్ విడుదల చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read also-Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!
‘నువ్వే చెప్పు చిరుగాలి’ అంటూ సాగే ఈ పాటను మంచు మనోజ్ విడుదల చేశారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ కి మంచు మనోజ్ అభినందనలు తెలియజేశారు. ఈ పాటను సాయి చరణ్ ఆలపించగా.. ఎంఎం కుమార్ బాణీని అందించారు. ఇక సుధీర్ బగడి రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. లిరికల్ వీడియోని చూస్తుంటే మంచి ప్రేమ కథా చిత్రాన్ని అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఇక హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉంది. పాటలోని తెలుగు పదాలు చాలా సరళంగా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం కూడా చాలా కొత్తదనంతో సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. మంచి పాటకు గాయకుడు సాయి చరణ్ ప్రాణం పోశారు.
Read also-Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?
ఎం ఎం కుమార్ స్వరపరిచిన బాణీలు చాలా ప్రెష్ గా అనిపించాయి. ఈ మూవీకి సురేష్ బాలా కెమెరామెన్‌గా, ఉపేంద్ర ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది. ఈ పాటలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే.. చాలా నేచురల్ గా అనిపిస్తుంది. హీరోయిన్ నటన అయితే అందరినీ మెప్పించేలా ఉంది. ఏది ఏమైనా మంచి సినిమాకు మంచు మనోజ్ పాట విడుదల చేయడంతో సినిమా మరింత ప్రేక్షకుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. విడుదలైన ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం సగటు సినిమా ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.