CM Revanth Reddy( IMAGE credit; swetcha reporter)
నార్త్ తెలంగాణ

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

CM Revanth Reddy: జ‌న‌గామ జిల్లాను పాఠ‌శాల‌ విద్యారంగంలో ముందుంచుతున్న జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్ నిజంగా దేశంలోనే భాద్‌షా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కొనియాడారు. జ‌న‌గామ జిల్లా((Jangaon District)క‌లెక్ట‌ర్ ప‌నితీరుకు ముచ్చ‌ట‌పడ్డారు సీఎం. దేశంలోనే ఎన్ ఏ ఎస్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వ‌రు సాధించ‌ని ఘ‌న‌త‌ను జ‌న‌గామ జిల్లా(Jangaon District)) సాధించ‌డం విశేషం. జ‌న‌గామ జిల్లా టాప్ 50లో చోటు సాధించ‌డంలో క‌లెక్ట‌ర్ జిల్లా అధికారుల‌కు చూపిన మార్గం, చేసిన దిశానిర్ధేశం, న‌డిపించిన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను సీఎం ప్ర‌శంసిస్తూ ప‌ర‌ఖ్ రాష్ట్రీయ స‌ర్వేక్ష‌ణ్ 2024 అవార్డును హైద‌రాబాద్‌లో గురుపూజోత్సం సంద‌ర్బంగా శిల్పాక‌ళావేదిక‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అందించారు.

 Also Read: BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు

క‌లెక్ట‌ర్‌తో పాటుగా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌, డీఈఓ పింకేష్ కుమార్‌కు అవార్డును అందించారు. క‌లెక్ట‌ర్ ఇటీవ‌ల అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. మ‌న నీరు మ‌న జిల్లా పేరుతో నిర్వ‌హించిన ఇంకుడు గుంత‌ల కార్య‌క్ర‌మం జాతీయ స్థాయిలో కేంద్ర కార్య‌ద‌ర్శి సైతం అభినందించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లా విద్యారంగంలో ముందుకు పోవ‌డానికి జాతీయ స్థాయిలో నిల‌వ‌డానికి అధికారులు, ఉపాధ్యాయుల కృషి, త‌ల్లిదండ్రుల స‌హాకారం, విద్యార్థుల ప‌ట్టుద‌ల ఉన్నాయ‌ని అన్నారు. భ‌విష్య‌త్‌లోనూ జిల్లాలో విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోతామ‌ని తెలిపారు.

 Also Read: Ganesh Immersion 2025: గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. వంద ప్రాంతాల్లో నిమజ్జనం.. 404 క్రేన్ల వినియోగం

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?