Kadiyam Srihari ( image CrediT: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Kadiyam Srihari: చివరి శ్వాస వరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Kadiyam Srihari: నా చివరి శ్వాస ఉన్నంత వరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీహరి(Kadiyam Srihari) అన్నారు. రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గానికి, ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం గండి రామారం (మల్లన్న గండి) రిజర్వాయర్ నుండి 29 కోట్లతో నిర్మించిన కుడి కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) మాట్లాడుతూ ఈ కాలువ నిర్మాణం ఒక అద్భుతం గుట్టలనుండి కూడా కాలువ తీయవచ్చు గోదావరి జలాలు పారించవచ్చు పంట పొలాలు పండించవచ్చు అని ఈ కాలువ నిరూపించిందని అన్నారు.

Also Read: Star Heroine: నానితో రొమాన్స్.. పెద్ద టార్చర్.. ఇంకోసారి అతనితో ఆ బెడ్ రూమ్స్ సీన్స్ చేయను?

 600ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు

29 కోట్లతో నిర్మించిన మల్లన్న గండి రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా 5 వేల 600ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుందని తెలిపారు. 2003 లో దేవాదుల మొదటి దశ ప్రారంభం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏతైనా ప్రాంతాలకు సాగు నీరు అందించాలని ప్రారంభించిన ప్రాజెక్టు దేవాదుల ఎత్తుపోతల ప్రాజెక్టు అని అన్నారు. ఆనాడు దేవాదుల పేరుతో కడియం శ్రీహరి కొత్త డ్రామా ఆడుతున్నాడని కొంత మంది విమర్శలు చేశారని, కానీ ఆనాడు విమర్శలు చేసిన వారికీ నేడు కాలువల ద్వారా పారుతున్న గోదావరి జలాలు చూసి జ్ఞానోదయం అయిందని అన్నారు. ఒకప్పుడు తొండలు గుడ్లు పెట్టని భూమిలో నేడు బంగారం పండుతుందని దానికి కారణం దేవాదుల ఎత్తిపోతల పథకమేనని పేర్కొన్నారు. రాష్ట్రం లోనే అత్యంత కరువు ప్రాంతం అయిన జనగామ నేడు పంట పొలాలతో సస్యశ్యామలం అయింది అంటే దానికి కారణం దేవాదుల ప్రాజెక్టేనని వెల్లడించారు. 1015 కోట్లతో ప్యాకేజీ 6 పనులకు ఆమోదం లభించింది అన్నారు.

78వేల ఎకరాలకు సాగు నిరందించే అవకాశం

గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్ట్ ను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. దేవాదుల ద్వారా నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించే అవకాశం ఉందని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి కాలువల వెంట తిరుగుతూ వెంటపడి పనులు చేస్తున్నానని తెలిపారు. దేవాదుల 3 దశ 6 ప్యాకేజీ ద్వారా 4 నియోజకవర్గాలలో 78వేల ఎకరాలకు సాగు నిరందించే అవకాశం ఉందని ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగానే సవరించిన అంచనాలతో 1015 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారని తెలిపారు. ఏడాది లోపు ప్యాకేజీ 6 పనులు పూర్తి చేసి చేస్తానని అన్నారు. తన నియోజకవర్గం మాత్రమే కాదు ఉమ్మడి జిల్లా అభివృద్ధి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాని వెల్లడించారు.

అభివృద్ధికి 1000 కోట్ల నిధులు

ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు తీసుకువచ్చానని, ఉమ్మడి జిల్లాలోనే ఏ నియోజకవర్గానికి ఇన్ని నిధులు రాలేదని తెలిపారు. 1000 ఎక్కడ వచ్చాయి అని అడిగే వారికీ ప్రతీ పని వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అశ్వారావుపల్లి కుడి కాలువ పనులు అసంపూర్తిగా ఉండడంతో కాలువ వెంట తిరిగి పనులు పూర్తి చేసి జీడికల్ వరకు నీళ్లు తీసుకువెళ్ళగలిగామని అన్నారు. గండి రామారం నుండి చిల్పూర్, వేలేరు మండలాలకు సాగు నీరు అందించేందుకు 104తో లిఫ్ట్ పనులు జరుగుతున్నాయని 3 నెలలో ఆ పనులు పూర్తి అవుతాయాని తెలిపారు. గండి రామారం కుడి కాలువ ఉప కాలువల పనులు కూడా త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గండి రామారం ఎడమ కాలువ పనులు కూడా త్వరలోనే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించి చూపిస్తానని స్పష్టం చేశారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు.

15 ఏళ్ళు అధికారంలో ఉండి ఎం చేశారు

రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గానికి, ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. 15 ఏళ్ళు అధికారంలో ఉండి ఎం చేశారని ఈ రోజు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఎడారి వంటి పరిస్థితుల్లో జీవిస్తున్న రైతుల సంక్షేమం కోసం ఇంత భారీ ఎత్తున నీటిని విడుదల చేయడం నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఇది కేవలం ప్రాజెక్ట్‌ నుండి నీటి విడుదల కాదు వందలాది కుటుంబాలకు కొత్త జీవం పోసే అభివృద్ధి అన్నారు. అభివృద్ధి కోసం కడియం శ్రీహరి ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసి ఇప్పటివరకు 800 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి జరగడం శ్రీహరి దూరదృష్టికి నిదర్శనం అని పేర్కొన్నారు.

నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తాం

ఘనపూర్‌కు తండ్రిగా, ప్రజలకు అండగా, తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా రోజూ నియోజకవర్గం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా రావచ్చు అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి మరింత నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తాం అని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ టెంపుల్ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కరుణాకర్ రావు, నరేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఎస్ఈ సుధీర్, ఈఈ వినయ్, డీఈ సంపత్, ఆర్డిఓ వెంకన్న తాసిల్దార్ వెంకటేశ్వర్లు ఏఈలు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

 Also Read: KCR: కేసీఆర్ తో గులాబీ నేతలు భేటీ.. వాటిని ఫోకస్ చేయాలని సూచన..?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?