KCR: కేసీఆర్ తో గులాబీ నేతలు భేటీ.. వాటిని ఫోకస్ చేయాలని..?
KCR (magecredit:twitter)
Political News

KCR: కేసీఆర్ తో గులాబీ నేతలు భేటీ.. వాటిని ఫోకస్ చేయాలని సూచన..?

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో పాటు పలువురు నేతలు భేటీ అయ్యారు. కవిత(kavitha) సస్పెండ్, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం సీబీఐ(CBI)కి అప్పగించడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు సుదీర్ఘంగా చర్చించారు. అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నిక(Local body elections)ల్లోనూ అనుసరించాలని అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. కవిత ఆరోపణలతో పార్టీకి ఏమేరకు డ్యామేజ్ అయిందని పార్టీ నేతలు కేసీఆర్ వివరించినట్లు సమాచారం.

Also Read: CM Revanth Reddy: చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్‌కు.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

సమిష్టిగా కలిసి

కవిత సస్పెండ్ తో పార్టీ నేతలు సైతం సొంతపార్టీపై విమర్శలు చేయడానికి వెనుకంజ వేస్తారని, అందరూ సమిష్టిగా కలిసి పనిచేయడానికి దోహదపడుతుందని అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పార్టీ నేతలంతా స్పందించాలని, కాంగ్రెస్(Congress) తీరును ఎండగట్టాలని కేసీఆర్(KCR) పిలుపు నిచ్చారు. సీబీఐ(CBI)కి ప్రభుత్వం అప్పగించడంలో రాజకీయ దురుద్దేశం ఉందని, దానిని ప్రజలకు వివరించాలని సూచించారు.

బీసీ(BC) రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని, బీసీలను చైతన్యం చేయాలని, వారికి జరుగుతున్న అన్యాయాలను వివరించాలని నేతలకు సూచించినట్లు సమాచారం. పార్టీపైనే దృష్టిసారించాలని నేతలకు మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud), జగదీష్ రెడ్డి(Jagadesh Reddy), ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjey), మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinodh Kumar) తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Also Read: Jayammu Nichayammu Raa: రియల్ హీరోలతో రియాలిటీ టాక్ షో.. బొమ్మ అదుర్స్ కదూ..

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..