Sanitation Crisis(IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Sanitation Crisis: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం.. పట్టించుకునే నాథుడే లేడా?

Sanitation Crisis:  పారిశుధ్యం పడకేసింది. గ్రామాల్లో సర్పంచులు లేకపోవటంతో పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామాల్లో సమస్యలున్నా చెప్పుదామంటే అధికారులు మా కాడ నిధులు లేవు ఏం చేయాలి అంత చేతులు ఎత్తేస్తున్నారు స్థానిక సమస్యలపై ఎవరికి చెప్పలు అర్థం కాక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసిన చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు నామమాత్రంగా పని చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాల్లోని పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షానికి డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి గడ్డి ఏపుగా పెరిగి దోమల ఉధృతి చెంది గ్రామీణ ప్రాంత ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇటీవల ఆరేపల్లి, జాగిరిపల్లి, గన్ పూర్ గ్రామాల్లో పలువురికి డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో కనిపించడంతో వైద్య సిబ్బంది నామమాత్రంగా మూడు గ్రామాల్లో దోమల ఉధృతిని తగ్గించేందుకు దోమల మందు పిచికారి చేయించారు.

 Also Read: Farmers Protest: ఆ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. కలెక్టర్ రావాలని డిమాండ్

నిధులు లేక ఇబ్బందులు

మండలంలో 26 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా మూడు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. గ్రామ పంచాయతీలకు నెలనెల రావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమ కాకపోవడంతో జీపీల నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. సిబ్బంది జీతాలు రెండు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ వారితో పని చేయించేవారు లేరు. సర్పంచులు లేక, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో నెలల తరబడి మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించడంతో వారు ఏ గ్రామంలో ఉంటున్నారో తెలియని పరిస్థితి ఉంది.

పంచాయతీ కార్యదర్శులపైనే భారం

23 గ్రామ పంచాయతీలు ఉండగా కార్యదర్శులే గ్రామాల్లో అత్యవసర సేవలకు ఖర్చు పెడుతున్నారు. పంచాయతీలకు నెలనెల వచ్చే కేంద్రం నిధులు కూడా నిలిచిపోవడంతో ఇబ్బందిపడుతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండల ప్రత్యేక అధికారితో పాటు, గ్రామాల ప్రత్యేకాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని, ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా డంపింగ్‌ యార్డులు

రోజు వారీగా చెత్తను తొలగించక పోవడంతో రోడ్లపైనే చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. కొన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కొన్ని గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు. వీధి దీపాలు ఎప్పుడు వెలుగుతున్నాయో, ఎప్పుడు ఆరిపోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. సర్పంచులు ఉంటే తాము వారికి సమస్యలు తెలిపిన వెంటనే పరిష్కరించేవారని, ఇప్పుడు అధికారులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?