Mahabubabad District: అధికారి వచ్చిన కొద్ది నెలల్లోనే మహబూబాబాద్ టౌన్ సిఐగా సరైనోడు అనిపించుకుంటున్నాడు. అక్రమ వ్యాపారాలు, ఆసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతూ.. తనదైన శైలిలో ముందుకు సాగుతూ ప్రజల మందనలు పొందుతున్నారు. అక్రమ వ్యాపారాలు, చోరీలు, అసాంఘిక కార్యకలాపాలను అణచివేసేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూ సీసీ కెమెరాలు(CC Camera) అమర్చుకునేలా చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాలు వల్ల కలిగే లాభాలను, ఆవశ్యకతను ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. సీసీ కెమెరాలు అమర్చుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గణేష్ మండపాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో కూడిన మినిట్ బుకింగ్ అందుబాటులోకి తీసుకొచ్చి పోలీస్ సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం వసూలు చేసే చందాల్లో 30% సీసీ కెమెరాలు కేటాయించాలని సూచిస్తున్నారు. కాలనీలు, గ్రామాలు, పట్టణాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ళలో సీసీ కెమెరాలపై ప్రత్యేక నిఘా పెట్టి పనిచేయని కెమెరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారింపు
మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని పలు వ్యాపార సముదాయ కేంద్రాల్లో నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్(Traffic) సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి నెహ్రూ సెంటర్లో సెంట్రల్ పార్కింగ్ ను తీసివేసి ఆ ప్రాంతంలో వాహనాలు నిలపకుండా వ్యాపారులు, వాహనదారులకు ప్రత్యేక సూచనలు చేశారు. మహబూబాబాద్ పట్టణంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీవ్ర ఆంక్షలు విధించారు. అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ నిలిపే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాంగ్ రూట్లో వెళ్లే వాహనాలు, పార్కింగ్ నిషేధిత ప్రాంతాల్లో వాహనాలు నిలిచిన వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేకపోతే సీజ్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు.
Also Read; BRS Harish Rao Protest: రోడ్లపై పరిగెత్తి.. సచివాలయం వద్ద బైఠాయించి.. హరీశ్ నేతృత్వంలో హైడ్రామా!
ఆటో డ్రైవర్లు, రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపడుతున్నారు. ఆటో డ్రైవర్లు(Auto drivers), రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తున్నారు. పట్టణంలో స్కూల్స్(Schools), ఆఫీస్ వేళల్లో హెవీ వాహనాలు ప్రవేశించకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు ముందు సాయంత్రం 6 తర్వాత మాత్రమే వ్యాపారాలకు సంబంధించిన వస్తువులను దిగుమతి చేసుకోవాలని ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెట్రో కార్, బ్లూ కోల్డ్స్, 100 డయల్ కాల్ రెస్పాండింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారు.
ఫైరవీలకు ఎలాంటి తావు లేకుండా
స్టేషన్ లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి రోజువారి ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. పిటీషన్ అందిన కొద్ది సమయంలోనే విచారణను వేగవంతం చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఫైరవీలకు ఎలాంటి తావు లేకుండా తనదైన శైలిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించే వీఐపీలు(VIP), వి విఐపి ల బందోబస్తు నిర్వహణలో సక్సెస్ రేటును పెంచుకుంటున్నారు. బాస్ మెచ్చిన అధికారిగా మెప్పు పొందుతున్నారు. తనదైన శైలిలో ఫిర్యాదారులకు న్యాయం చేస్తూ ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా గట్ల మహేందర్ రెడ్డి సరైనోడు అనే పేరును సైతం తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు.
Also Read; Sivakarthikeyan: చిరు డైలాగ్ చెప్పమంటే బాలయ్య డైలాగ్.. సుమకి షాకిచ్చిన శివకార్తికేయన్!