Peddi Sudarshan (imagecredit:swetcha)
Politics

Peddi Sudarshan: త్వరలో మరో కుంభకోణాన్ని బయటపెడతా..?

Peddi Sudarshan: త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Sudharshan Reddy) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరిస్తూన్న సీఎం, మంత్రులు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం లో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలం అవుతుంటే సీఎం మూసీ మీదనే ప్రేమ ఒలక బోస్తున్నారని, ఆటల పోటీల మీద సీఎం రివ్యూ చేస్తున్నారని మండిపడ్డారు. పంటలు అనేక ఎకరాల్లో మునిగిపోయినా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని మండిపడ్డారు.

తమ పదవులకు రాజీనామా

యూరియా(Urea) దొరక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వని సీఎం రేవంత్(CM Revanth) ,మంత్రి తుమ్మల(Min Tummala) తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖలో జరిగిన ధాన్యం సేకరణ కుంభ కోణం పై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఆర్ టీ ఐ(RTI) ద్వారా సమాచారం సేకరించాలని ప్రయత్నిస్తే విషయం న్యాయస్థానాల్లో ఉందని తప్పించుకుంటున్నారని, వివాదం కోర్టుల్లో ఉంటే ఆర్ టీ ఐ సమాచారం ఇవ్వరా ? ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశానికి ధాన్యం సేకరణ టెండర్ల ఫైల్ రాబోతోందన్నారు.

Also Read: Hanumakoda District: వినాయక చవితి నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కీలక సూచన

మంత్రులు జైలు కు వెళ్లక తప్పదని..

నలుగురు బిల్డర్లకు క్విడ్ క్రో పద్ధతి లో లబ్ది చేకూర్చేందుకు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 400 కోట్ల రూపాయల ఈఎండీలో బిడ్డర్ల నుంచి 68 కోట్ల రూపాయలే జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 400 కోట్లను బిడ్డర్ల నుంచి వసూలు చేయకపోతే మొత్తం కేబినెట్ జరిగిన తప్పునకు భాద్యత వహించాల్సి ఉంటుందని, తప్పు చేసిన బిడ్డర్లను కాపాడితే సీఎం(CM) మంత్రులు జైలు కు వెళ్లక తప్పదని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) కు ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కె .వాసుదేవ రెడ్డి ,వై .సతీష్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేతలు శ్రీనివాస్ రాజు ,కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Also Read: Adluri Laxman: సిరిసిల్ల ప్రజల ఓట్లతో గెలిచి చేసిందేంటి? పదేళ్ల పాలనలో ఆర్థిక సంక్షోభంలోకి?

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు