Dondigal Lake Accident: ఎక్కడికి వెళ్లినా తండ్రి వెంటనే వెళ్లే బుడతడు నాన్నతో గణేష్ నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవ శాత్తు ఆటో చెరువు లో పడి తండ్రి తో కలిసి కానరాని లోకాలకు వెళ్లిన దుర్ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుత్బుల్లాపూర్ దుండిగల్ మండలం దుండిగల్(Dondigal)గ్రామానికి చెందిన శ్రీనివాస్ (34)సోని దంపతులు నివాసం ఉంటారు. స్థానిక శ్రీనివాస్ ఆటో నడుపుతు ఉంటాడు, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.పెద్ద కుమారుడు వెస్లీ (07) ఒకటో తరగతి చదువుతున్నాడు. వెస్లీ తండ్రి శ్రీనివాస్ తో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు.
Also Read: Nestle CEO Fired: నెస్లే కంపెనీ సీఈవోపై తొలగింపు వేటు.. చేసింది అలాంటి పని మరి
నిమజ్జనానికి వెళ్లి తిరిగి రాలేదు
ఆటోలో గణేష్ నిమజ్జనానికి కాలనీ వాసులతో వెళ్లిన తండ్రి కొడుకులు గణేష్ నిమ్మజ్జనం అవగానే దుండిగల్(Dondigal) చెరువు కట్ట పై ఆటో మలుపు కోవడానికి ముందుకు వెళ్లి వెళ్లి చీకట్లో ప్రమాదవశాత్తు చెరువులో వీరి ఆటో పడిపోయింది.ఈ విషయం ఎవరు గమనించకుండా అతనికి ఫోన్ చేశారు,ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం తో చూసి చూసి నిమజ్జనం పూర్తి చేసుకుని కాలనీ వాసులు ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ శ్రీనివాస్, వెస్లీ మాత్రం కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఇంట్లో వారు ఆందోళన చెందారు. రాత్రంతా ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో చివరికి దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు.
చెరువులో ఆటో జాడ
సమాచారం అందుకున్న పోలీసులు(Paolice) చెరువు వద్దకు చేరుకుని పరిశీలించగా, ఒక రాయి విరిగి చిందరవందరగా పడిఉండటం గుర్తించారు. చీకట్లో ఆటో చెరువులో జారిపోయిందన్న అనుమానంతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. డిఆర్ఎఫ్ సిబ్బంది బృందం చెరువులో బోట్లతో, పరికరాలతో సోమవారం ఉదయం మూడు గంటల పాటు గాలించి చివరికి ఆటోను,తండ్రి కుమారుడి మృతదేహలను వెలికితీశారు. ఆటో ముందు సీట్లో కూర్చొని అలాగే మృతి చెందిన తండ్రి కొడుకుల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు స్థానికులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. బంధం చివరి క్షణాల్లో కూడ విడదీయలేదా అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. నాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడమే తనకిష్టం. అదే బంధం… చివరికి నాన్నతో కలిసి మరణంలో కూడా అతడిని విడవకుండా చేసిందని ఆ తల్లి రోదనలు మిన్నంటాయి.
దుందిగల్ మున్సిపాలిటీపై ఆరోపణలు
ఈ ఘటనపై మృతుల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “78.34 కోట్ల రూపాయలు మున్సిపల్ నిధులు ఉండి కూడా మున్సిపల్ అధికారులు చెరువు వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయలేదు. చెరువు దారిలో లైట్లు మొత్తం పెట్టలేదు. ఈ నిర్లక్ష్యం వల్లే మావాళ్ళ ప్రాణాలు పోయాయాని అధికారుల పై మండి పడ్డారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పేద కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.