Viral Video: పాకిస్తాన్ జర్నలిస్టు మెహరున్నీసా (Mehrunnisa) రిపోర్టింగ్ చేసిన ఒక వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గతంలో వైరల్ అయిన ‘చంద్ నవాబ్ ఫ్రం కరాచీ’ క్లిప్‌తో నెటిజన్లు పోలుస్తున్నారు. వరదలపై రిపోర్ట్ చేస్తున్న క్రమంలో మెహరున్నీసా తన గుండె దడ గురించి కూడా వీడియోలో మాట్లాడింది. ‘మెరా దిల్ యూంయూం కర్ రహా హై’ (నా గుండె ఇలా ఇలా (పడవ ఊగుతున్నట్లుగా) కొట్టుకుంటోంది) అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళ్తే..
దయాదీ దేశం పాకిస్థాన్ (Pakisthan) లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాలకు రావి నది ఉప్పొంగింది. దీంతో దాని పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. అయితే అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టేందుకు ఓ న్యూస్ ఛానెల్ కు చెందిన మహిళా జర్నలిస్ట్ మెహరున్నీసా అక్కడకు వెళ్లారు. సహాయక చర్యలు చేపడుతున్న బోట్ లోకి ఎక్కి.. రిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో అలల తాకిడికి బోటు కాస్త అటు ఇటు ఊగింది. దీంతో కంగారు పడిన ఆమె.. నా గుండె కూడా పడవ లెక్క ఊగిపోతోందని అన్నారు.
Also Read: PM Modi: నా తల్లిని తిట్టారు.. నన్ను అవమానించారు.. ప్రధాని ఎమోషనల్
‘నాకు అసౌఖర్యంగా ఉంది’
ఈ వీడియోను మెహరున్నీసా పనిచేస్తున్న మీడియా ఛానల్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఎక్కడ మునిగిపోతానోన్న భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆమె వీక్షకులను ఉద్దేశిస్తూ ‘మై హార్ట్ ఈజ్ గోయింగ్ డౌన్ అని చెప్పింది. దయచేసి మాకోసం ప్రార్థించండి. నాకు చాలా అసౌకర్యంగా ఉంది, నేను భయపడ్డాను’ అని పేర్కొంది.
https://t.co/BwmHaOHvtD#Pakistani #PakistanFloods #mehrunnisa pic.twitter.com/MreQrRTEUX
— Nikhil Pandey (@Nikhil_Pandey04) August 28, 2025
Also Read: Alphabet Killer: 91 ఏళ్ల సీరియల్ కిల్లర్.. వీడి క్రైమ్ రికార్డ్ తెలిస్తే.. వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
నెటిజన్లు ఏమంటున్నారంటే?
పాక్ జర్నలిస్టు వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వరదలకు ఏమాంత్రం భయపడకుండా ఆమె రిపోర్టింగ్ చేయడాన్ని కొందరు ప్రశంసిస్తున్నారు. నీరంటే భయం ఉన్నప్పటికీ ప్రజల కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలన్న ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం మహిళా జర్నలిస్టుపై సెటైర్లు వేస్తున్నారు. నీరు అంటే భయం ఉన్నప్పుడు మరొకర్ని రిపోర్టింగ్ కు పంపొచ్చు కదా అని సూచిస్తున్నారు. మెుత్తం మీద పాక్ జర్నలిస్ట్ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.