Alphabet Killer (Image Source: Twitter)
Viral

Alphabet Killer: 91 ఏళ్ల సీరియల్ కిల్లర్.. వీడి క్రైమ్ రికార్డ్ తెలిస్తే.. వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Alphabet Killer: అమెరికాలో వరుస హత్యలతో బీభత్సం సృష్టించిన జోసేఫ్ నాసో (Joseph Naso) గురించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగు చూసింది. ‘అల్ఫాబెటిక్ కిల్లర్’ గా పేరొందిన అతడు నలుగురిని చంపిన కేసులో ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే జైలులో అతడితో పాటు కలిసి ఉన్న ఓ వ్యక్తి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు అల్భాబెటిక్ కిల్లర్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశాయి. అయితే అందరూ అనుకున్నట్లు తాను చంపింది నలుగుర్ని కాదని.. ఏకంగా 26 మంది మహిళలను చంపానని నాసో స్వయంగా తోటి ఖైదీకి చెప్పడం తీవ్ర దుమారం రేపింది.

ఎవరెవర్ని చంపాడంటే?
91 ఏళ్ల జోసెఫ్ నాసో ప్రస్తుతం కాలిఫోర్నియా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఒకే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న మహిళలను హత్య చేసినందుకు అతనికి ‘అల్ఫాబెట్ కిల్లర్’ అనే బిరుదు వచ్చింది. నలుగురు మహిళలను చంపినట్లు తేలడంతో జోసెఫ్ కు 2013లో కోర్టు శిక్ష విధించింది. జోసెఫ్ తన తొలి హత్యను 1977లో చేశాడు. 18 ఏళ్ల రాక్సెన్ రొగ్ గాష్ ను ఫెయిర్ ఫాక్స్ సమీపంలో చంపేశాడు. ఆ తర్వాత 22 ఏళ్ల కార్మెన్ కొలన్ ను (1978), 30 ఏళ్ల పామెలా పార్సన్స్ (1993), 31 ఏళ్ల ట్రేసీ టాఫోయా (1994), అలాగే 1988లో తన ప్రేయసిని చంపిన నేరం కింద జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

‘హత్యల గురించి గొప్పలు చెప్పేవాడు’
అయితే జోసెఫ్ నాసోతో సహచర ఖైదీగా జైలులో ఉండొచ్చిన బిల్ నోగ్యూరా (Bill Noguera) అనే వ్యక్తి తాజాగా అంతర్జాతీయ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో నోగ్యూరా మాట్లాడుతూ నాసో పదేళ్లకు పైగా తన హత్యల గురించి గర్వంగా చెప్పుకునేవాడని తెలిపాడు. బాగా పాపులర్ అయిన కొన్ని హత్యల వివరాలను కూడా అతను పంచుకున్నాడని చెప్పాడు. తను చేసిన హత్యను మరో కిల్లర్ రాడ్నీ ఆల్కాలా ఖాతాలో పోలీసులు వేసినప్పుడు అతడు చాలా కోపగించుకున్నాడని పేర్కొన్నాడు.

’10 హత్యలు ఎంతో ప్రత్యేకమట’
నాసో తను చేసిన వాటిలో 10 హత్యలను మాత్రం గ్రేటెస్ట్ హిట్స్ గా అభివర్ణించుకున్నారని సహచర ఖైదీ తెలిపాడు. అందులో ఒకరు పామెలా లాంబ్సన్ (19) హత్య అని పేర్కొన్నట్లు చెప్పాడు. ఆమెను నాసో.. ఓక్లాండ్ ఏస్ టీమ్ అధికారిక ఫోటోగ్రాఫర్‌గా నటిస్తూ మోసం చేశాడని అన్నాడు. ఆపై లాంబ్సన్‌పై అత్యాచారం చేసి 1977లో ఆమెను హత్య చేశాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక చెట్టుకు ఆనించి ఫోటోలు తీసినట్లు నాసో తనకు చెప్పినట్లు వివరించాడు.

Also Read: Thummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇక యూరియా కష్టాలు తీరినట్లే.. మంత్రి కీలక ఆదేశాలు

చంపకముందే చచ్చినట్లుగా ఫొటోలు
కనీసం ఆరుగుర్ని చంపకముందే చనిపోయినట్లుగా నాసో ఫొటోలు తీశాడని నోగ్యూరా చెప్పాడు. నోసా ఎప్పుడూ ది డోర్స్ బ్యాండ్ పాట “రైడర్స్ ఆన్ ది స్టోర్మ్” సాంగ్ వింటూ ఉండేవాడని పేర్కొన్నాడు. ఆ పాటలోని ‘దేర్స్ ఎ కిల్లర్ ఆన్ ది రోడ్/హిస్ బ్రెయిన్ ఈజ్ స్క్విర్మింగ్ లైక్ ఎ టోడ్’ లిరిక్స్ అతడికి ఎంతగానో ప్రేరణ ఇచ్చేవని అన్నారు. ఇదిలా ఉంటే నాసో హత్యలకు సంబంధించి ఓ డాక్యుమెంటరీని సైతం రూపొందించారు. దానికి ‘డెత్ రో కాన్ఫిడెన్షియల్: సీక్రెట్స్ ఆఫ్ ఎ సీరియల్ కిల్లర్’ అనే పేరు పెట్టారు. సెప్టెంబర్ 13న ఆక్సిజన్ ఛానెల్‌లో ఇది ప్రసారం కానుంది.

Also Read: PM Modi: నా తల్లిని తిట్టారు.. నన్ను అవమానించారు.. ప్రధాని ఎమోషనల్

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?