Hero Naga Chaitanya Enjoying Full Time With Sobhita In Europe Photos
Cinema

Viral News: ఆమెతో హీరో డేటింగ్‌, వైరల్ అవుతోన్న ఫొటోస్‌ 

Hero Naga Chaitanya Enjoying Full Time With Sobhita In Europe Photos: టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున తనయుడు హీరో నాగచైతన్య, నటి సమంతను ప్రేమించి 2017 ఏడాదిలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి కాపురం చాలా కాలం నిలవలేదు. కొద్ది నెలలకే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే అప్పటి నుంచి సమంత మయోసైటీస్ బారినపడటంతో పూర్తిగా మూవీస్‌కి దూరమై ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది.

ఇక నాగచైతన్య విషయానికొస్తే.. బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌తో బిజీ అయిపోయాడు. అలాగే గత కొద్దికాలంగా చై యంగ్ బ్యూటీ శోభితతో డేటింగ్‌లో ఉన్నట్లు నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శోభితతో ఓ హోటల్‌కు వెళ్లడంతో వీరి డేటింగ్ నిజమేనని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అలాగే నిత్యం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో వీరి డేటింగ్ రూమర్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. అంతేకాదు శోభిత, చైతు ఇద్దరు నెట్టింట పలు ఫొటోలతో తమ రిలేషన్‌ను ఇండైరెక్ట్‌గా రివీల్‌ చేసినట్లు పుకార్లు వచ్చాయి. కానీ వీరు మాత్రం డేటింగ్ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కొందరు నిజమే అని వాదిస్తున్నారు. తాజాగా శోభితతో నాగచైతన్య యూరప్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Also Read:హీరోయిన్ లవ్ బ్రేకప్, ఆందోళనలో ఫ్యాన్స్

దీంతో అది చూసిన వారు కొందరు సమంత విడాకులు తీసుకోగానే చై మూవ్ ఆన్ అయ్యాడని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, అందుకే యూరప్‌కు వెళ్లారని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ వీరికి సంబంధించిన ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే శోభిత డేటింగ్ వార్తలపై స్పందించినట్లు తెలుస్తోంది. వ్యక్తులు సగం జ్ఞానంతో రాసే విషయాలకు ఆన్సర్ ఇవ్వడం కంటే వదిలేయడం మంచిది. ప్రశాంతంగా ఉండండి. మంచి వ్యక్తిగా ఉండటానికి ట్రై చేయండని ఫైర్ అయ్యింది. ఏదేమైనా ఈ న్యూస్‌పై క్లారిటీ రావాలంటే మాత్రం చైతూ రియాక్ట్ అవ్వాల్సి ఉంది.

 

View this post on Instagram

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!