buaty-song(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Beauty movie: ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ వచ్చిన ‘బ్యూటీ’.. లిరిక్స్ భలే ఉన్నాయి భయ్యా..

Beauty movie: అందమైన ప్రేమ కథకు, ఫ్యామిలీ ఎమోషన్‌ను జోడిస్తూ తీసే చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అలాంటి చిత్రమే ‘బ్యూటీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను వదిలారు నిర్మాతలు. ఈ చిత్రం నుంచి అందమైన మెలొడీ సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. అలాంటి ‘బ్యూటీ’ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. ఇక తాజాగా ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. విజయ బుల్గానిన్ ఇచ్చిన సూథింగ్ బాణీకి సనారే రాసిన లిరిక్స్ ఎంతో ట్రెండీగా ఉన్నాయి. ఇక ఇటీవలె జాతీయ అవార్డు అందుకున్న పీవీఎన్ఎస్ రోహిత్ పాడిన ఈ పాట ఇట్టే మనసుని తాకేలా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ ఈ కథ తిరిగే విధానం అన్నీ కూడా ఆడియెన్స్‌ని కట్టి పడేసేలా ఉన్నాయి.

Read also-PM Modi – SCO Summit: చైనా టూర్ సూపర్ సక్సెస్.. భారత్‌తో చేతులు కలిపిన రష్యా, డ్రాగన్.. ఇక పాక్, యూఎస్ పని ఔట్!

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ మూవీకి విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా టీం ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మరింత పెంచింది. ఈ మేరకు ‘బ్యూటీ’ నుంచి ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ క్యాచీగా సాగే లవ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు నటన ఈ సినిమాకు ఎసెర్ట్ కానుంది.

Read also-Afghanistan earthquake: భారీ భూకంపం.. 500 మంది మృత్యువాత.. 1000 మందికిపైగా గాయాలు!

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా, ఆర్ట్ డైరెక్టర్ గా బేబీ సురేష్‌ భీమగాని, ఎడిటర్ గా ఎస్‌బి ఉద్ధవ్‌ పని చేశారు. ఈ సినిమాకు బి.ఎస్.రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.  మెలొడీ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..