Afghanistan earthquake: అఫ్గానిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 500కి చేరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 1000 మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేశాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఆదివారం మధ్యాహ్నం జలాలాబాద్ కు 17 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. పాక్ సరిహద్దుకు దగ్గరలో ఈ భూకంపం సంభవించడం గమనార్హం.
తాజాగా మరో ఐదు భూకంపాలు
భూకంపం సంభవించిన ఏరియా పర్వత ప్రాంతం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత కొరవడుతోంది. ‘ప్రాణ నష్టం, మౌలిక సదుపాయాల విధ్వంసం గురించి కచ్చితమైన సమాచారం రావడానికి కొంత సమయం పడుతుందని అఫ్గాన్ ప్రజారోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. ‘మేము పెద్ద ఎత్తున రక్షణ చర్యలు ప్రారంభించాము. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయం చేయడానికి వందలాది మందిని మోహరించాము’ అని ఆయన అన్నారు. ఆదివారం నాటి భారీ భూకంపం తర్వాత సోమవారం కూడా ఐదు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.5 నుండి 5.2 తీవ్రతతో అవి సంభవించనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది.
❗️🇦🇫 – On August 31, 2025, a 6.0-magnitude earthquake struck Kunar Province, Afghanistan, near Pakistan, killing at least 250 and injuring over 500, per Bakhtar News Agency.
Centered 27 km east-northeast of Jalalabad at a shallow 8 km depth, the quake caused severe damage in… pic.twitter.com/CQABKwbOkv
— 🔥🗞The Informant (@theinformant_x) September 1, 2025
2022లో 1000 మంది మృతి
అఫ్గానిస్తాన్ భూకంపాలకు అత్యంత ప్రభావిత దేశం. ఇది భారత, యూరేషియన్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండడం వల్ల తరచూ భూకంపాలు వస్తుంటాయి. భూకంప ప్రభావిత ప్రాంతమైన తూర్పు అఫ్గానిస్తాన్ లోని పర్వత ప్రాంతంలో కొండచరియలు సైతం విరిగిపడుతుండటంతో రక్షణ చర్యలు మరింత కష్టతరం అవుతున్నాయి. ఈ భూకంపం కేవలం 5 మైళ్ల లోతులో సంభవించడం వల్ల నష్టం ఎక్కువగా ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో తూర్పు అఫ్గానిస్తాన్‌లో 5.9 తీవ్రత గల భూకంపం సంభవించి దాదాపు 1,000 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు.
Also Read: Kaleshwaram Project Scam: కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు!
అత్యంత క్లిష్ట సమయంలో..
2023లో పశ్చిమ అఫ్గానిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో ఒక వారం రోజుల్లో మూడు సార్లు 6.3 తీవ్రత గల భూకంపాలు సంభవించాయి. వీటిలో సుమారు 1,500 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా సంభవించిన ఈ భూకంపం అఫ్గానిస్తాన్‌కు అత్యంత క్లిష్ట సమయంలో వచ్చింది. ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటైన అఫ్గానిస్తాన్ వరుసగా నాలుగేళ్లుగా కరువు సమస్యను ఎదుర్కొంటోంది. పైగా ఈ ఏడాది ఇరాన్, పాకిస్థాన్‌ల నుండి తిరిగి వచ్చిన 23 లక్షలకుపైగా అఫ్గాన్లు తిరిగి దేశంలోకి చేరారు.
Also Read: Justin Bieber: అభిమానులను ఆశ్చర్య పరిచిన పాప్ సింగర్.. ఏం చేశాడో తెలుసా..
ఆహార నిల్వలో ఇబ్బందులు
‘మొదటి, రెండో సీజన్ పంట ఉత్పత్తి తక్కువగా రావడం.. పశువుల ఆదాయం తగ్గడం వల్ల శీతాకాలానికి కావలసిన ఆహార నిల్వలు చేసుకోవడంలో అఫ్గాన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని అమెరికా అభివృద్ధి సంస్థ (USAID) స్థాపించిన ఫేమిన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ నెట్‌వర్క్ గత వారం ఇచ్చిన నివేదికలో పేర్కొంది.