PM Modi - SCO Summit (Image Source: Twitter)
అంతర్జాతీయం

PM Modi – SCO Summit: చైనా టూర్ సూపర్ సక్సెస్.. భారత్‌తో చేతులు కలిపిన రష్యా, డ్రాగన్.. ఇక పాక్, యూఎస్ పని ఔట్!

PM Modi – SCO Summit: చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా షాంఘై సహకార సంస్థ (SCO) 25వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటికి భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదం గురించి మోదీ మాట్లాడారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ విధానాలు ఏమాత్రం అంగీకార యోగ్యం కాదని స్పష్టం చేశారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి గురించి కూడా  మోదీ ప్రస్తావించారు. దీంతో మోదీ తీసుకున్న వైఖరికి షాంఘై సహకర కూటమి మద్దతు తెలిపింది. ఇది పాకిస్థాన్ కు బిగ్ షాక్ కాగా.. భారత్ కు రాజనీతి పరంగా పెద్ద విజయమేనని చెప్పవచ్చు.

‘ఉగ్రవాదం ఎగదోసే వారిని శిక్షించాలి’
షాంఘై కూటమిలోని సభ్య దేశాలు.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై సంతాపాన్ని తెలియజేశాయి. ఇలాంటి దాడులను జరిపినవారిని, ప్రణాళికలు రచించినవారిని, ప్రోత్సహించినవారిని తప్పక శిక్షించాల్సిందిగా పేర్కొన్నాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎగదోసే కుటిలమైన ప్రయత్నాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని SCO స్పష్టం చేసింది. ఉగ్రవాదం ఏ రూపంలోనైనా అసహ్యకరమని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో “రెండు విధానాలు” అంగీకారయోగ్యం కాదని షాంఘై సభ్య దేశాలు ప్రకటించాయి. అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదాన్ని ముఖ్యంగా సరిహద్దులు దాటి జరిగే ఉగ్రచర్యలను అణచివేయాలని పిలుపునిచ్చింది.

ఉగ్రవాదంపై మోదీ స్పీచ్
అంతకుముందు మోదీ మాట్లాడుతూ గత నలభై ఏళ్లుగా భారత్ ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని అన్నారు. అనేక మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారని గుర్తుచేశారు. ‘ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దీనికి తాజా ఉదాహరణ. ఈ కష్ట సమయంలో మాకు తోడుగా నిలిచిన మిత్రులకు ధన్యవాదాలు. ఇది కేవలం భారతదేశపు ఆత్మపై దాడి కాదు. మానవత్వాన్ని నమ్మే ప్రతి దేశానికి సవాలు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగ మద్దతు ఇవ్వడం అంగీకారయోగ్యమా? అని ప్రశ్నించారు. భద్రత, శాంతి, స్థిరత్వం ప్రతి దేశ అభివృద్ధికి ముఖ్యమని ఆయన అన్నారు. ‘ఉగ్రవాదం, వేర్పాటువాదం, మితిమీరిన సిద్ధాంతాలు అభివృద్ధికి పెద్ద సవాళ్లు. ఉగ్రవాదం ఒక్క దేశానికి సంబంధించినది కాదు. మొత్తం మానవత్వానికి సవాలు. అందుకే ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో ఐక్యత అవసరం’ అని చెప్పారు. ‘ఉగ్రవాదంపై రెండు విధానాలు అంగీకరించలేమని స్పష్టంగా ఒకే స్వరంతో చెప్పాలి. ఉగ్రవాదం ఏ రంగులో ఏ రూపంలో వచ్చినా ఎదిరించాలి. ఇది మన మానవత్వం బాధ్యత’ అని ఆయన అన్నారు. అయితే ప్రధాని మోదీ ఉపయోగించిన ఈ పదమే టియాంజిన్ ప్రకటనలో ప్రతిఫలించింది.

Also Read: Afghanistan earthquake: భారీ భూకంపం.. 500 మంది మృత్యువాత.. 1000 మందికిపైగా గాయాలు!

పాక్ ప్రధానిని పట్టించుకోని మోదీ
ఇదిలా ఉంటే చైనాలోని టియాంజిన్‌లో జరిగిన SCO సదస్సు భారత్, రష్యా, చైనా శక్తుల ఐక్యతను ప్రపంచానికి చాటింది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నవ్వులు, ఆలింగనాలు, షేక్ హ్యాండ్స్ వంటి సన్నివేశాలు ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాల దాడుల నడుమ ఈ దృశ్యాలు స్పష్టమైన సందేశాన్ని అమెరికాకు పంపాయి. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతులు పట్టికొని నడుస్తున్న దృశ్యాలు సైతం అంతర్జాతీయ మీడియాను ఆకర్షించాయి. సుంకాల పేరుతో అమెరికా ఎంతగా బెదిరించినా భారత్ – రష్యా మైత్రి చెక్కుచెదరదని ఈ చర్య ద్వారా సంకేతం ఇచ్చినట్లైంది. అనంతరం వారిద్దరు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి నవ్వుతూ మాట్లాడటం కూడా షాంఘై సదస్సులో హైలెట్ నిలిచింది. అయితే పుతిన్, మోదీ మాట్లాడుకుంటూ వెళ్లే క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పక్కనే ఉన్నప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగడం విశేషం. అంతేకాదు ఈ సదస్సులో పాక్ ప్రధానిని మోదీ సైతం అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం.

Also Read: Justin Bieber: అభిమానులను ఆశ్చర్య పరిచిన పాప్ సింగర్.. ఏం చేశాడో తెలుసా..

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?