GHMC Projects: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ది, నగరవాసులకు అందిస్తున్న అత్యవసర పౌర సేవల నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకునే స్టాండింగ్ కమిటీ మరోసారి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన సమావేశమైంది. కమాండ్ కంట్రోల్ రూం లో జరిగిన ఈ కమిటీ సమావేశంలో అజెండాలోని 9 అంశాలు, టేబుల్ ఐటమ్స్ గా తీసుకున్న మరో నాలుగు అంశాలకు కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్(RV Karnan), స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, మహాలక్ష్మి రామన్ గౌడ్, సి.ఎన్.రెడ్డి, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్ప పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సత్యనారాయణ, వేణుగోపాల్, సుభద్ర, పంకజ, గీతా రాధిక, మంగతాయారు, జోనల్ కమిషనర్లు హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ సీసీపీ గంగాధర్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, లేక్స్ ఈఈ నారాయణ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కమిటీ ఆమోదించిన ఎజెండాలోని అంశాలు
1. ఎల్బీ నగర్ జోన్ హయాత్ నగర్ సర్కిల్ వార్డు నంబర్ 11 లోని కుమ్మరి కుంట చెరువు నుండి రాఘవేంద్ర కాలనీ బస్ డిపో వరకు రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టే బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియకు స్టాండింగ్ కమిటీ పరిపాలనపరమైన పిలుచుటకు పరిపాలన అనుమతి కి కమిటీ ఆమోదం
2. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ)-2లో భాగంగా 1142. 54 కిలోమీటర్లు రూ. 2828 కోట్లు వ్యయంతో ( 2025 నుంచి 2030) వరకు 5 ఏళ్ల పాటు పాత నియమనిబంధనలతో 5 ఏళ్ల పాటు జోన్ వారిగా ప్యాకేజీ తో చేపట్టేందుకు పెండింగ్ అప్రూవల్ తో ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు సవరించిన వ్యయం మంజూరీకి కమిటీ ఆమోదం
3. కూకట్ పల్లి సర్కిల్ వార్డు నెంబర్ 120 లోగల బాలానగర్ ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ ఏరీనా నిర్వహణ కు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్లను ఆహ్వానించేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్. దీంతో పాటు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఏడాదికి ధర రూ.1,35,550 రెంటల్ చార్జెస్ చెల్లించేందుకు అనుమతి మంజూరు
4. చార్మినార్ జోన్, చార్మినార్ పాత బస్టాండ్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ ఆపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్ బేసిస్ ప్రకారంగా 15 ఏళ్లు, ఆ తర్వాత మరో 5 ఏళ్ల పాటు పెర్ఫార్మెన్స్ కండిషన్ ప్రకారంగా పెంచేందుకు అనుమతిస్తూ కమిటీ ఆమోదం
5. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్ ) స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్ ముగిసినందున, ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమగ్ర ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్ట్ తో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎల్ ఈ డీ వీధి లైట్స్, సీసీఎంఎస్ బాక్స్ లు, ఎల్ ఈడీ లైట్లు, సీసీఎంఎస్ ప్యానెల్ పోల్ కేబుల్, పోల్ బాక్స్, విండోలు యాక్సెసరీస్ పాత స్తంభాలు ఆపరేషన్ నిర్వహణతో పాటుగా అదనపు కొత్త ఎల్ ఈ డీ పిక్చర్స్, సీసీఎంఎస్ ఏర్పాటు రూ.897 కోట్లు (18 శాతం జీఎస్ టీ) తో అంచనా తో సిఫార్సు చేయగా, పరిపాలన అనుమతి తో పాటు గా టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు కమిటీ ఆమోదం.
Also Read: Bhupalapally Shocking: అడవిలో యువతి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాం.. అఘాయిత్యం చేసి చంపారా?
6. ఖైరతాబాద్ జోన్ లో వివిధ ప్రాంతాలలో స్మార్ట్ పార్కింగ్ మౌలిక వసతులు, డిజిటల్ సపోర్ట్ కోసం ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలువగా అర్హత కలిగిన రెండు బిల్డర్స్ జ్రూతి సొల్యూషన్స్, జూకె టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనలు క్వాలిఫై ఆయన బిల్డర్స్ అనుమతికి ఆమోదం.
7. గోషామహల్ సర్కిల్ లోని బేగం బజార్ ఫిష్ మార్కెట్ డిప్యూటీ కమిషనర్ టెండర్ కమ్ ఓపెన్ యాక్షన్ కౌన్సిల్ చేయగా, 16 స్టాళ్లతో పాటు 15 స్టాల్స్ కు సాధారణ రెట్ల పై అద్దెకిచ్చేందుకు అనుమతి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ మత్స్యకారుల సహకార సంఘం సమాఖ్య అభ్యర్థనను పరిగణలోనికి తీసుకోవాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫ్లోర్ వారిగా అద్దె, లీజు ప్రకారం కిరాయి నిర్ణయించి, ఇంతకు ముందు ఉన్న ఎండు చేపల వ్యాపారులకు 16 దుకాణాలు కు గాను 15 స్టాల్స్, ఆర్డినరీ రేట్స్ కేటాయించడానికి, తెలంగాణ ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మెన్ లేఖను పరిగణలోకి తీసుకుని అద్దెలకు కే్టాయించేందుకు అనుమతి. పిటిషనర్ డబ్ల్యుపీ 3291/4099/2025 ప్రకారంగా 9 ఎండు చేపల విక్రయదారులకు కేటాయించిన పాత స్టాల్ యజమానులు అద్దె చెల్లించిన రషీదులు ప్రూఫ్ కొరకు సమర్పించాలని కమిటీ ఆదేశం.
8. జీహెచ్ఎంసీ హెల్త్ సెక్షన్ హెడ్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఈ. వెంకటేష్ తో పాటు ఇతరులకి పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కమిటీ గ్రీన్ సిగ్నల్
9. జులై మాసానికి సంబంధించిన ఆదాయ వ్యయాల సమాచారాన్ని వివరించేందుకు కమిటీ ఆమోదం.
Also Read: VV Vinayak: కథతో సిద్ధంగా ఉన్న టాప్ దర్శకుడు.. హీరో ఓకే అంటే పట్టాలెక్కడమే ఆలస్యం
టేబుల్ ఐటమ్స్
1. హయత్‌నగర్ సర్కిల్-3 లోని నాగోల్ చెరువు నుండి వేంకటరామణ కాలనీ వరకు మూసీ నది లోకి వెళ్లే స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ఆర్ సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.5 కోట్ల అంచనా వ్యయ ప్రతిపాదనకు పరిపాలన అనుమతి
2. బంజారా హిల్స్ లో రోడ్ నం.5 నుండి స్ట్రీట్ నెం. 1 వరకు (జేవీఆర్ బంజారా అవెన్యూ) హైదర మంజిల్ నుండి కలివా హౌజ్ వరకు 18 మీటర్ల వెడల్పుతో రోడ్డు అభివృద్ధి ప్రణాళిక. దీంతో ఎఫెక్టు అయ్యే 30 ఆస్తుల స్వాధీనానికి కమిటీ అనుమతి
3. చీఫ్ ఇంజనీర్ (లేక్స్ ) సమర్పించిన ప్రతిపాదన వచ్చే అక్టోబర్ 31 వరకు మిగతా పనులు, తుది బిల్లులు పూర్తి చేసేందుకు ఏపీడీఎస్ఎస్ కింద బీపీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కు కమిటీ అనుమతి మంజూరు. మిగతా పనుల కోసం రూ. 2.4 కోట్ల రేట్లతోనే ఒప్పందం చేసుకునేందుకు కమిటీ ఆమోదం. ప్రైమ్ ఏజెన్సీ అయిన ఒర్సు మారుతి, పనులు పూర్తయ్యే వరకు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వరకు, చెల్లింపులు పూర్తి అయ్యే వరకు హోల్డ్‌లో ఉంచాలని కమిటీ ఆదేశం.
4. శేరిలింగంపల్లి జోన్ లో అంబేడ్కర్ కాలనీ నుండి శిశు మందిర్ ప్రాంతం (తిమ్మక్క చెరువు) వరకు వర్షపు నీటి కాలువ నిర్మాణానికి రూ.5.60 కోట్ల వ్యయంతో, ఎస్ఎన్ డీపీ నిధుల నుండి ఖర్చు చేసేందుకు స్టాండింగ్ కమిటీ పరిపాలనపరమైన మంజూరీకి కమిటీ ఆమోదం.
Also Read: PV Sindhu: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సంచలనం