GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: రియల్ టైమ్ మానిటరింగ్.. నిమజ్జనంపై బల్దియా ఫుల్ ఫోకస్..?

GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్‌ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, సాఫీగా జరిగిలా పకడ్బందీ చర్యలు చేట్టాలని జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్(Commissioner R.V. Karnan) అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులతో కలిసి సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద తవ్విన కుంట, నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా బేబీ పాండ్, అమీర్‌పేట్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పోర్టబుల్ పాండ్లను, వాటి నాణ్యత ను ప్రత్యక్షంగా పరిశీలించారు. భద్రతా, శుభ్రత, స్మూత్ నిమజ్జన విధానాలను సమీక్షించారు. నిర్వాహకులు, కమ్యూనిటీ నాయకులు, భద్రతా ఏజెన్సీ ల మధ్య సమన్వయం ను కమిషనర్ సమీక్షించారు. బారికేడింగ్,లైటింగ్, క్యూ లైన్ లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జనం సజావుగా జరిగేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

భక్తులకు అందుబాటులో

గత లోటుపాట్లను సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నిమజ్జనం జరగాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు, శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, ట్రాఫిక్(Traffic) నిర్వహణ అంశాలపై బహుముఖ వ్యూహంతో ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. ప్రధాన నీటి వనరుల పై ఒత్తిడి తగ్గేలా చూడడం, ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేసే ఉద్దేశ్యంతో భక్తులకు అందుబాటులో ఉండేలా నగరవ్యాప్తంగా 72 కృత్రిమ నిమజ్జన పాయింట్లు సిద్ధం చేసినట్లు వివరించారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన పాయింట్ లలో 56 వేల 187 తాత్కాలిక లైట్లు, 309 మొబైల్ టాయిలెట్లు, బారికేడింగ్, త్రాగునీటి సదుపాయం, మైక్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం వేగంగా, స్మూత్ గా జరిగేలా చూసేందుకు 134 స్టాటిక్ క్రేన్లు, అదనంగా 269 మొబైల్ క్రేన్లు వినియోగిస్తున్నామని వివరించారు. 160 గణేష్ అసిస్టెన్స్ టీమ్ లు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: Sports News: ఎంఎస్ ధోనీపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు

స్వచ్ఛత కు అధిక ప్రాధాన్యం

14 వేల 486 శానిటేషన్ సిబ్బంది, 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు మూడు షిఫ్ట్ లలో నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్త్తూ, నిమజ్జనోత్సవంలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కమిషనర్ కర్ణన్ వివరించారు. .గణేష్ మండపాల వద్ద వ్యర్థాల సేకరణకు 5 లక్షల ట్రాష్ బ్యాగులు పంపిణీ చేశామని, అదనంగా 2 వేల మంది స్వీపర్లు 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 30 స్వీపింగ్ మెషిన్లు ఫైనల్ నిమజ్జనం జరిగే రోజున నిమజ్జన చెత్త సేకరణ, తొలగింపులో నిమగ్నమై ఉంటాయని వివరించారు. ప్రత్యేక శుభ్రతా డ్రైవ్‌లో భాగంగా 1400 మెట్రిక్ టన్నుల చెత్త, శిథిలాలు తొలగిచామని, ఆయన వెల్లడించారు.

నిమజ్జనం ప్రక్రియ

వివిధ రూట్లలో సుమారు 839 కి.మీ. మేర నిమజ్జన రూట్ లలో అంతర్గత రోడ్ల కు ఇరు వైపుల చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్ చేసినట్లు కూడా ఆయన తెలిపారు. దీనికి తోడు 56 వేల ఇళ్లలో యాంటీ లార్వల్ ఆపరేషన్లు పూర్తి చేశామని, వైద్యారోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వ్యర్థాలు పేరుకుపోయే ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరిచినట్లు కమిషనర్ చెప్పారు. నిమజ్జనం ప్రక్రియ సాఫీగా, వేగంగా, ప్రశాంతంగా జరిగేలా రోజువారీ సమీక్షలు నిర్వహించి వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని కూడా పెంచుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. పోలీసులతో కలిసి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, నిమజ్జనం సజావుగా సాగేందుకు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: Kothagudem Politics: పొలిటికల్ వార్.. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎవరు..?

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..