Mulugu District: ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ ఎదుట నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఏడుగురు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. ములుగు(Mulugu) జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను ఎస్పీ శబరిష్(SP Shabarish) వెల్లడించారు.
పోరు కన్నా ఊరు మిన్నా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రవేశపెట్టిన పోరు కన్నా ఊరు మిన్నా..మన ఊరికి తిరిగి రండి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. వారి కోసం తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ పునరావాస సదుపాయాలను కల్పిస్తోంది. ఈ కార్యక్రమాలకు ఆకర్షితులైన నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ కేడర్లలో ఉన్న వారంతా తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణం గడిపేందుకు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.
లొంగిపోయిన వారి వివరాలు
మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏడుగురు సభ్యులు (ఇందులో నలుగురు మహిళలు) ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఇందులో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడు (ఏ సి ఎం), ముగ్గురు పార్టీ సభ్యులు, ఒకరు పూజారి కాంకేర్ ఆర్ పి సి అధ్యక్షుడు, మరొకరు పూజారి కాంకేర్ ఆర్పిసి మలేషియా సభ్యుడు, ఇంకొకరు చైతన్య నాట్య మండలి సభ్యురాలు (సిఎన్ఎం) ఉన్నారు. ఈ ఏడాది జనవరి 25 నుండి నేటి వరకు ప్రస్తుతం లొంగిపోయిన ఏడుగురు సభ్యులతో కలిపి ములుగు జిల్లాలో మొత్తం 80 మంది మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ హోదాల్లోని సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో డివిజన్ కమిటీ సభ్యులు (డి వి సి ఎం ఎస్) ముగ్గురు, ఏరియా కమిటీ సభ్యులు (ఏ సి ఎం) 11 మంది, పార్టీ సభ్యులు 25 మంది, మలేషియా సభ్యులు 29 మంది, ఆర్ పి సి సభ్యులు ముగ్గురు, డి ఏ కె ఎం ఎస్/కె ఏ ఎం ఎస్ సభ్యులు ఇద్దరు, సిఎన్ఎం సభ్యులు ఏడుగురు మందితో సహా మొత్తం 80 మంది ఉన్నారు. వీరందరికీ పునరావాస పథకానికి అనుగుణంగా తగిన సదుపాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
Also Read: Indian Railway: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లు డైవర్షన్, మరికొన్ని రద్దు.. ట్రైన్స్ లిస్ట్ ఇదే!
సభ్యులకు ఎస్పి విజ్ఞప్తి
అడవుల్లో ఉన్న ఆదివాసి గ్రామాలకు ప్రజలు మావోయిస్టులకు సహకరించడం మానేయడంతో ఆహార పదార్థాలు కూడా అందక వివిధ క్యాడర్లలో ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడవడానికి కూడా శక్తి లేనంతగా శారీరక పరిస్థితి దిగజారినట్లు తెలుస్తోంది. వీరిలో 90 శాతం పైగా క్యాడర్లు నిరుపేద ఆదివాసీలు కాగా, తమ కుటుంబాల అభివృద్ధి కోసం మావోయిస్టు పార్టీని వీడి ప్రజాస్వామ్య ప్రభుత్వాల మార్గంలో అభివృద్ధికి భాగస్వాములవుతున్నారని ఎస్పీ తెలిపారు. ఇది మంచి పరిణామమని కొనియాడారు. మావోయిస్టు పార్టీలో ఇంకా ఉన్న సభ్యులకు ఎస్పి విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న వారు “పోరుకున్న ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి” కార్యక్రమంలో పునరావాసానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను, తక్షణ సహాయాలను ప్రభుత్వం ద్వారా పోలీస్ శాఖ అందిస్తుందన్నారు. ఇప్పటివరకు లొంగిపోయిన వారందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రివార్డులు అందజేసి తక్షణ సహాయం కింద పునారావు బాష సదుపాయాలు అందించామన్నారు.
మావోయిస్టులకు సహకరిస్తే
తెలంగాణ రాష్ట్రం ఆదివాసీల అభివృద్ధి కోసం నిబద్దతతో పనిచేస్తుందన్నారు. పోలీస్ శాఖ సైతం తనవంతు బాధ్యతను నెరవేరుస్తుందన్నారు. ఆదివాసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు నమ్మకంతో కానీ, భయంతో గాని మావోయిస్టులకు సహకరిస్తే మీ ప్రాంతాలు అభివృద్ధి చెందవని స్పష్టం చేశారు. అభివృద్ధి కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ప్రజల శాంతియుత జీవనం, అభివృద్ధి పొలిషేక ప్రధాన దయమని వెల్లడించారు. ప్రస్తుతం లొంగిపోయిన ఏడుగురు మావోయిస్టు సభ్యులకు తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25 వేల చొప్పున అందించడంతో పాటు వారి హోదాల ఆధారంగా మిగిలిన మొత్తం 7 లక్షల రూపాయలను ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా లలో చెక్కుల ద్వారా అందజేస్తామని వెల్లడించారు.
Also Read: Kishan Reddy: జన్‌ధన్ యోజనకు 11 ఏండ్లు పూర్తి.. దేశవ్యాప్తంగా 56 కోట్ల ఖాతాలు