Vinayaka Immersion: ఇన్సిడెంట్ ఫ్రీ ఈవెంట్‌గా వినాయక నిమజ్జనాన్ని జరుపుకోవాలి
క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి
స్వేచ్ఛ, మేడ్చల్: ఇన్సిడెంట్ ఫ్రీ ఈవెంట్‌గా (దుర్ఘటనలు రహిత) వినాయ నిమజ్జనాన్ని (Vinayaka Immersion) జరుపుకోవాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శుక్రవారం శామీర్‌పేట్ చెరువులో నిర్వహిస్తున్న సౌకర్యాలను అడిషినల్ డీసీపీ పురుషోత్తంతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.
Read Also- Viral News: హెల్పర్‌కు స్టీరింగ్ అప్పగించి.. కొద్దిసేపటికే డ్రైవర్ మృతి.. ఏం జరిగిందంటే?
ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించి, వినాయక వాహనాల రాకపోకలకు సరిపడే విధంగా రోడ్డు నిర్మించాలని సూచించారు. చెరువులో నీటి శాతం పెరిగినందున నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బ్యారికేడింగ్‌ను పకడ్బందీగా నిర్మించాలని సూచన చేశారు. చెరువు దగ్గర 2 పాయింట్లలో క్రేన్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. లైటింగ్, శానిటేషన్, వైద్య సదుపాయం, త్రాగునీరు, టాయిలెట్లు అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ వినాయక విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నందున, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు.
Read Also- CM Revanth Reddy: సీఎం సంచలన నిర్ణయం.. ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో అది తప్పనిసరి!
పోలీసు, ట్రాఫిక్ బందోబస్తు, ఫైర్ శాఖలవారు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. భక్తులు వినాయక నిమజ్జనాన్ని నిరాటంకంగా ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తారని కలెక్టర్ చెప్పారు. చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, శామీర్ పేట్ ఎంఆర్వో యాదగిరిరెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారి శ్రీనివాస్ మూర్తి, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్, ఎస్ఐ శశివర్థన్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, విద్యుత్తు శాఖా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.