Mahabubabad District: నకిలీ పాసుపుస్తకాల ముఠా సభ్యులు అరెస్ట్!
Mahabubabad District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: నకిలీ పాసుపుస్తకాల ముఠా సభ్యులు అరెస్ట్..ఎక్కడంటే..?

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబాబాద్ డి.ఎస్.పి ఎన్ తిరుపతి రావు(DSP Thirupathi Rao) తెలిపారు. కురవి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి నిందితులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కురవి మండల కేంద్రంలో ఈ ముఠా రైతులకు రైతులకు నకిలీ పాసు పుస్తకాలు(Fake passbooks) తయారుచేసి, ఒక్కో పట్టాదారు పాసు బుక్ లకు రూ. 10000 వసూలు చేసి పాసు బుక్కులను ఇస్తున్నారు. ఈ పాస్ పుస్తకాల ద్వారా వివిధ బ్యాంకులలో లోన్లు ఇప్పిస్తున్నట్లు తిరుగుతున్న ముగ్గురు నిందితులను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు వివరించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

కురవి మండలం మంచే తండాకు చెందిన మూడు బాలాజీ, మహబూబాబాద్ మండలం ఆమనగల్ కస్నా తండాకు చెందిన భానో త్ హరికిషన్(Bhanot Harikishan), జఫర్గడ్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన భానోత్ వర్జన్ ల నుంచి 2 కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, ఓ ల్యాప్టాప్, 16 నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి వివరించారు. వివరాల్లోకి వెళ్తే.. మూడు బాలాజీ, బానోతు హరికిషన్, బానోతు వర్జన్ లు ఒక ముఠాగా ఏర్పడి రైతులకు పాసుబుక్కులు తయారు చేయించి మీకు ఎక్కువ లోన్లు ఇప్పిస్తామని నమ్మబలికి వారి వద్ద నుంచి ఒక్కో పాసు బుక్కుకు రూ. 10000 వసూలు చేసినట్లు తెలిపారు.

Also Read: Akhanda 2 Postponed: పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. అందుకే రావడానికి లేట్!

దొంగ పాసు పుస్తకాల కేసు

కురవి యూనియన్ బ్యాంకు లో ఒకరికి, డోర్నకల్ యూనియన్ బ్యాంకులో ఆరుగురికి, మహబూబాబాద్ కెనరా బ్యాంకు(Mahabubabad Canara Bank)లో ముగ్గురికి ఇలా మొత్తం రూ. 16 లక్షల90 వేల లోన్లు మంజూరు అయ్యేలా చేశారని డిఎస్పి తెలిపారు. దొంగ పాసు పుస్తకాల కేసు సుమోటోగా బుక్ చేసి విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని వివరించారు. ఈ ముఠా తో సంబంధం ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో రూరల్ సీఐ సర్వయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ హత్తి రామ్, కురవి ఎస్సై సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Thammudu Movie re release: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా ‘తమ్ముడు’ రీ రిలీజ్.. హంగామా మొదలైంది

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క