Thammudu Movie re release
ఎంటర్‌టైన్మెంట్

Thammudu Movie re release: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా ‘తమ్ముడు’ రీ రిలీజ్.. హంగామా మొదలైంది

Thammudu Movie re release: టాలీవుడ్‌లో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడన్ని సినిమా ఇండస్ట్రీలకు చేరింది. ఒకప్పటి సినిమాలను ఇప్పుడు సరికొత్తగా ముస్తాబు చేసి థియేటర్లలో రీ రిలీజ్ చేస్తుంటే.. ఆ సినిమాలు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నాయి. ‘ఆరెంజ్’, ‘పోకిరి’, ‘ఖుషి’, ‘ఖలేజా’, ‘మురారి’.. వంటి సినిమాలు రీ రిలీజ్‌లో రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మొదటిసారి విడుదలైనప్పుడు ‘ఆరెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కానీ, రీ రిలీజ్‌లో మాత్రం చెక్కు చెదరని రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడిదే కోవలో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన కెరీర్‌లో గొప్ప చిత్రంగా నిలిచిన ‘తమ్ముడు’ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.

రీ రిలీజ్‌లలో పవన్ రికార్డ్..
ఇప్పటి వరకు వచ్చిన రీ రిలీజ్‌ సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నటించిన సినిమాలు రీ రిలీజ్‌లో దుమ్మురేపాయి. ‘గబ్బర్ సింగ్’, ‘ఖుషి’, ‘జల్సా’ వంటి సినిమాలు రీ రిలీజ్‌లోనూ భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రమైన ‘తమ్ముడు’ బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది.

Also Read- Team India Jersey: జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ బరిలోకి టీమిండియా!.. ఎందుకంటే?

బర్త్‌డే స్పెషల్‌గా..
స్టార్ హీరోల పుట్టినరోజులను పురస్కరించుకుని వారి ఓల్డ్ సినిమాలను రీ రిలీజ్ చేసే సంప్రదాయం నడుస్తోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆగస్ట్ 30వ తేదీనే ‘తమ్ముడు’ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా, ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్న సంస్థ అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కంటే ముందే పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ‘తమ్ముడు’ (Thammudu Movie re release) మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read- Manchu Mohan babu: ఇక లాభం లేదని.. మోహన్ బాబు విశ్వరూపం చూపించబోతున్నారా?

రీ రిలీజ్ హక్కులు ఎవరికంటే..
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ ఫిల్మ్స్‌పై శ్రీమతి మునీశ్వరి సమర్పించిన ‘తమ్ముడు’ మూవీ రీ రిలీజ్ హక్కుల్ని ఉత్తరాంధ్రకు చెందిన వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలు విక్రమ్ బ్రదర్స్, ఆసన్ సూర్య దేవర చేజిక్కించుకున్నారు. ఉత్తరాంధ్రలో ‘తమ్ముడు’ మూవీ రీ రిలీజ్‌ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని వారే కాకుండా, అభిమానులు కూడా నమ్మకంగా ఉన్నారు. ‘తమ్ముడు’ 1999లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా సినిమాగా నిలిచింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బి. శివరామకృష్ణ నిర్మించారు. రమణ గోగుల సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?