Manchu Mohan Babu
ఎంటర్‌టైన్మెంట్

Manchu Mohan babu: ఇక లాభం లేదని.. మోహన్ బాబు విశ్వరూపం చూపించబోతున్నారా?

Manchu Mohan babu: మంచు ఫ్యామిలీ (Manchu Family)కి ఈ మధ్యకాలంలో అస్సలు కలిసి రావడం లేదు. మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu), మంచు విష్ణు చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూస్తుంది. రాక రాక పాజిటివ్ టాక్ వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా కూడా ఫైనల్‌గా లాస్ ప్రాజెక్ట్‌గానే మిగిలింది. దీంతో మంచు ఫ్యామిలీ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మోహన్ బాబు తన రూటును మార్చాలని భావిస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది. ఆ రూట్ ఏదో కాదు, తనని స్టార్‌ని చేసిన విలన్ మార్గంలో మళ్లీ పయనించాలని ఆలోచన చేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఓ సినిమాలో ఆయన విలన్‌గా చేయబోతున్నట్లుగా కూడా ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- TG Rains Effect: దక్షిణ డిస్కం పరిధిలో నేలకూలిన 1,357 విద్యుత్ స్తంభాలు.. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ

జయకృష్ణ పరిచయం చిత్రంలో విలన్‌గా
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయకృష్ణ (Jayakrishna) సినిమాలో మంచు మోహన్ బాబు విలన్‌గా చేయబోతున్నారంటూ ఓ వార్త బాగా సర్క్యులేట్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super star Mahesh Babu) అన్న కొడుకైన జయకృష్ణ అరంగేట్రానికి సంబంధించి ఈ మధ్య బాగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా చేసేందుకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓకే చెప్పినట్లుగా తెలుగు చిత్రసీమలో టాక్ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు రాలేదు.

‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌తో..
అజయ్ భూపతి సినిమాల పేర్లు చాలా వెరైటీగా ఉంటాయి. జయకృష్ణ అరంగేట్రం చేస్తున్న సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లుగా టాక్ వినబడుతోంది. అంతేకాదు, ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీని తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నారనేలా కూటా టాక్ వినిపిస్తుంది. ఇదే జరిగితే, తొలి సినిమాతోనే బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరోగా జయకృష్ణ రికార్డ్ క్రియేట్ చేస్తాడని చెప్పుకోవచ్చు.

Also Read- SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా ‘వేదవ్యాస్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే?

అక్టోబర్‌లో ప్రారంభం
ఘట్టమనేని ఫ్యామిలీ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రారంభించనున్నారని సమాచారం. ప్రస్తుతం అజయ్ భూపతి ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేశారని, ప్రస్తుతం క్యాస్టింగ్‌కు ఎంపిక చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన నిర్మాతగానూ వ్యవహరించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!