RTI (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

RTI: ఇది సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిది..?

RTI: ఆర్.టి.ఐ(RTI) సామాన్యుడు చేతిలో వజ్రాయుధమని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి స్పష్టం చేశారు. మహబూబాబాద్(Mehabubabad) కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార శాఖ కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి(Ayodhya Reddy), పీవీ శ్రీనివాస్(PV Srinivass), మోహ్సినా పర్వీన్, దేశాల భూపాల్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 18,000 కేసులు సమాచార శాఖ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులను గత మూడు నెలలుగా పరిష్కరిస్తున్నామన్నారు.

 కేసులను పరిష్కరించే దిశగా

ఇప్పటికే నాలుగు వేల కేసులను పరిష్కరించి సంబంధిత వ్యక్తులకు న్యాయం చేశామన్నారు. ఇందులో 10 శాతం కేసులు వాయిదా పడినట్లుగా తెలిపారు. 15 జిల్లాల్లో జీరో కేసులు చేశామన్నారు. మిగతా కేసులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించి ముందుకు సాగుతున్నామన్నారు. సాధ్యమైనంతవరకు పెండింగ్లో ఉన్న అన్ని కేసులను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ జిల్లాలో కూడా పెండింగ్ కేసులు లేకుండా పరిష్కరించడమే ధ్యేయంగా ఆర్.టి.ఐ పనిచేస్తుందన్నారు. ఎక్కువ కేసులు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలో ఉన్నాయన్నారు. వీటన్నింటిని ప్రత్యేక ప్రణాళిక రచించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

Also Read: Artificial Beach: హైదరాబాద్‌కు కృత్రిమ సముద్రం.. బీచ్ ఏర్పాటుకు ప్లాన్స్ రెడీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పిచ్చోడి చేతిలో రాయి

తక్కువ కేసులు ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పరిష్కరించేందుకు తొలుత కృషి చేస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 166 కేసులు ఉన్నాయని చెప్పారు. ఆర్టిఐ అనేది మంచి చట్టమని దీని విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సమాచార చట్టం పిచ్చోడి చేతిలో రాయి కాకూడదని, పౌరులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని బాధ్యతతో పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలకు, మంచి పాలనకు, పారదర్శకతకు ఆర్.టి.ఐ దోహదపడేలా చట్టం పనిచేస్తుందన్నారు. చీపురు కట్ట ఊడ్చేస్తుందని… సమాచార చట్టం సమస్యలు తీర్చేస్తుందని స్పష్టం చేశారు.

Also Read: Sridevi Vijaykumar: మీరేంటో చెప్పడానికి మాటలు చాలవు నాన్న.. శ్రీదేవి విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!