TS Govt
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Health Alert: తెలంగాణలోని 8 జిల్లాల్లో వైద్యశాఖ హైఅలర్ట్.. ఎందుకంటే?

Health Alert: ఆరోగ్యశాఖకు అంటువ్యాధుల టెన్షన్?

వరద ప్రాంతాల్లో భయాందోళన
హెల్త్ డిపార్ట్‌మెంట్ ఎమర్జెన్సీ రివ్యూ
వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు
స్క్రీనింగ్‌తో పాటు మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ కూడా
8 జిల్లాల్లో వైద్యశాఖ హైఅలర్ట్

తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖకు అంటు వ్యాధుల (Health Alert) టెన్షన్ మొదలైనది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోగాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని గుర్తించింది. ఈ మేరకు వ్యాధుల వ్యాప్తి చెందే ప్రాంతాలు, వైద్యారోగ్యశాఖ యాక్షన్ ప్లాన్ రిపోర్టును ప్రభుత్వానికి సంబంధిత అధికారులు అందజేశారు. వాతావరణంలోని మార్పులతో ప్రధానంగా విషజ్వరాలు ఎక్కువగా ప్రబలే ముప్పు ఉన్నది. దీంతో వరద ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు పెట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వరద ఏరియాల్లో క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. రోగాల స్క్రీనింగ్‌తో పాటు మెడిసిన్‌ను డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్ని విభాగాల హెచ్ వోడీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ముపు ప్రదేశాలు, ఏజెన్సీ ఏరియాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read Also- Ganesh immersion: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు.. అధికారుల ప్లానింగ్ ఇదే

యాక్షన్ ప్లాన్…
మంత్రి ఆదేశాలతో వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ రెడీ అయ్యారు. అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. వరద ఉదృతి తీవ్రంగా ఉన్న ఏరియాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను సిద్ధం చేశారు. దీంతో పాటు పునరావస కేంద్రాల్లో క్యాంపులు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ రెడీ అయింది. ఈ క్యాంపులో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్​, ల్యాట్ టెక్నిషియన్, ఇతర సపోర్టెట్ స్టాఫ్ భాగస్వామ్యం కానున్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు, టెస్టింగ్ కిట్లను కూడా క్యాంపుల్లో ఉంచనున్నారు. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో వచ్చినోళ్లకు వెంటనే టెస్టులు నిర్వహించనున్నారు. మొబైల్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన టెంపరరీ ల్యాబ్ లోనే నమునాలు సేకరించి మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధుల పరీక్షలు నిర్ధారించనున్నారు. మరోవైపు మున్సిపల్ శాఖతో సమన్వయమై ఫాగింగ్, దోమల మందు పిచికారీ వంటివి నిర్వహించనున్నారు. యంటీ లార్వ ఆపరేషన్ కు ఆయిల్ బాల్ లు వేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు.

Read Also- Sridevi Vijaykumar: మీరేంటో చెప్పడానికి మాటలు చాలవు నాన్న.. శ్రీదేవి విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

గర్భిణీలపై ఫోకస్..
వరదలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోన్నది. సేఫ్​గా ఉన్న పంక్షన్ హాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సెంటర్లను నెలకొల్పుతున్నారు. తాత్కాలిక విధానంలో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక, గర్భిణీల కోసం ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీలను వినియోగించనున్నారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ (ఈడీడీ) దగ్గరగా ఉన్న గర్భిణీలను ముందే ఆయా కేంద్రాలకు తరలించనున్నారు. దీంతో పాటు సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంసీహెచ్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ ఫెసిలిటీ సెంటర్లలో వెయిటింగ్ రూమ్ లను ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 లకు పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటాయి.ఆయా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మందులను స్టాక్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.మరోవైపు రాష్ట్రంలో వరదలు తగ్గినా, రోగాలు వెంటాడే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు జ్వర సర్వేను కూడా చేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు