Mamita Baiju Signed Three Projects At Once
Cinema

Premalu Actress: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో భామ

Mamita Baiju Signed Three Projects At Once: ప్రేమలు ఫేమ్ మలయాళ బ్యూటీ మమితా బైజు కెరీర్‌లో స్పీడ్ పెంచి మంచి దూకుడు మీదుంది. రెబల్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. ఫస్ట్ మూవీతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. జీ.వి ప్రకాశ్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచి డిజాస్టర్‌ మూవీగా నిలిచింది. ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నప్పటికి ప్రేమలు మూవీతోనే మంచి సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ.

ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన మమితా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ చేతిలో వరుసగా మూడు సినిమాలు ఉన్నాయని సమాచారం. విష్ణు విశాల్ హీరోగా ఫాంటసీ కామెడీ నేపధ్యంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మమితను హీరోయిన్‌గా కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ హీరోగా వస్తున్న మూవీలో సైతం మమితా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నట్లు టాక్.

Also Read: ట్రెండింగ్‌లోకి ట్రైలర్‌, ఈసారి హిట్‌ ఖాయం 

గ్రామీణ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక వీటితో పాటు మరో మూవీ కూడా ఓకే చేసినట్లు తెలుస్తుండగా, మమితా డిమాండ్ పెరిగిపోదంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?