Ganesh Mandapams Hyderabad: హైదరాబాద్ లో గణేష్ చతుర్థి ఉత్సవాలను ఏ స్థాయిలో నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినాయక చవితి వచ్చిందంటే నగర వ్యాప్తంగా వందలాది మండపాలు కొలువుదీరతాయి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నగరంలోని ప్రతి వీధిలో గణేష్ మండపం ఏర్పాటైంది. అయితే నగరంలో వందలాది గణేష్ విగ్రహాలు కొలువుదీరినప్పటికీ కొన్ని మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాటిలో ఈ ఏడాది తప్పనిసరిగా దర్శించాల్సిన టాప్ – 7 మండపాలను ఈ కథనంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ మండపాలు ఏవి? ఎక్కడ ఏర్పాటై ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు? ఇప్పుడు పరిశీలిద్దాం.
ఖైరతాబాద్ గణేష్
వినాయక చవితి వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఖైరతాబాద్ గణేష్’ (Khairatabad Ganesh). ప్రతీ ఏటా నగరంలో కొలువుదీరే అతిపెద్ద విగ్రహం ఇదే కావడం విశేషం. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేశారు. విశ్వశాంతి మహాశక్తి గణపతి థీమ్‌తో గణేష్ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఎకో ఫ్రెండ్లీ మూర్తి (ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బ్యాన్ కారణంగా)గా దీన్ని నిర్మించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులు, పూరి జగన్నాథ్, సుభద్ర, బలరామ్ విగ్రహాలు ఈసారి పక్కనే దర్శనమివ్వనున్నాయి. సెప్టెంబర్ 6 వరకూ ప్రతిరోజూ 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య భక్తులు దర్శనం చేసుకోవచ్చు.
బాలాపూర్ గణేష్
ఖైరతాబాద్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నది బాలాపూర్ గణేష్ (Balapur Ganesh). ఈ మండపం లడ్డుకూ చాలా ఫేమస్. ఏటా జరిగే వేలంలో రికార్డు ధరను ఈ లడ్డు సొంతం చేసుకుంటూ ఉంటోంది. ఈసారి స్వర్ణగిరి టెంపుల్ థీమ్ డెకరేషన్ తో మండపాన్ని తీర్చిదిద్దారు. ప్రతి రోజూ 10వేల మంది భక్తులు సందర్శిస్తున్నారు. 18 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని సెప్టెంబర్ 6న హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు.
తిరంగా యూత్ గణేష్, నాగోల్
ఖైరతాబాద్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద విగ్రహంగా నాగోల్ లోని తిరంగా గణేష్ విగ్రహం నిలిచింది. 63 అడుగుల ఎత్తుతో ఎకో ఫ్రెండ్లీ విధానంలో (మెుత్తం మట్టితోనే) దీన్ని రూపొందించారు. 25 మంది బెంగాల్ కార్మికులు రెయింబవళ్లు కష్టపడి దీన్ని నిర్మించారు. సెప్టెంబర్ 5 వరకూ ఈ వినాయకుడు దర్శనం అందుబాటులో ఉండనుంది. 6న హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు.
గన్ ఫౌండ్రీ కా రాజా
హైదరాబాద్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరొక వినాయక మండపం ‘గన్ ఫౌండ్రి కా రాజా’. పాత నిజాం యుగం కాలం నాటి థీమ్ తో ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి గణనాథుడు.. 20-25 అడుగుల ఎత్తులో కొలువుదీరాడు. వినాయక చవితి ప్రారంభమైన నాటి నుంచి 10 రోజుల పాటు దర్శనానికి అందుబాటులో ఉండనుంది.
నెమలి గణపయ్య, బేగం బజార్
బేగంబజార్ లోని ఈ మండపాన్ని నెమలి థీమ్ తో ఏర్పాటు చేశారు. 20 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఈ విగ్రహం.. నగరంలోని విభిన్నమైన గణేష్ విగ్రహాల్లో ఒకటిగా ఈ ఏడాది నిలిచింది. అంతేకాదు బేగం బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మండపాల్లో ఇదే నెం.1 అని భక్తులు చెబుతున్నారు.
Also Read: Class 9 Girl: టాయిలెట్ అని వెళ్లి.. స్కూల్ బాత్రూమ్‌లో.. బిడ్డను కన్న 9వ తరగతి బాలిక
ట్రూప్ బజార్ గణేష్, కోఠి
కోఠిలోని ట్రూప్ బజార్ లో ఏర్పాటు చేసిన ఈ గణేష్ మండపం కూడా హైదరాబాద్ టాప్ – 7 జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక్కడి గణనాథుడు నాలుగు చేతులతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ విగ్రహం ఎత్తు 15-20 అడుగుల ఎత్తు ఉంది. ట్రూప్ బజార్ లోని విద్యుత్, శానిటరి షాపుల మధ్యలో ఈ స్పెషల్ మండపాన్ని ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు ఈ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు.
View this post on Instagram