BiTV Premium Pack (Image Source: twitter)
బిజినెస్

BiTV Premium Pack: కేవలం రూ.151తో.. 25 ఓటీటీలు, 450 ఛానళ్లు.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!

BiTV Premium Pack: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం బంపరాఫర్ ప్రకటించింది. బీఐ టీవీ (BiTV) డిజిటల్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన ప్రీమియం ప్యాక్ ను తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం నెలకు రూ.151 చెల్లిస్తే 25కు పైగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, 450కి పైగా లైవ్ టీవీ ఛానల్స్ పొందవచ్చు.

వివరాల్లోకి వెళ్తే..
బీఎస్ఎన్ఎల్ (Bharat Sanchar Nigam Limited) తన మెుబైల్ యూజర్ల కోసం ప్రత్యేకంగా బీఐటీవీ (BiTV) అనే డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సేవను 2025 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇది కేవలం సెల్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటే డైరెక్ట్-టు-మొబైల్ (D2M) సర్వీస్. ప్రముఖ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అగ్రిగేటర్ అయిన ఓటీటీ ప్లే (OTT Play)తో కలిసి బీఎస్ఎన్ఎల్ బీఐటీవీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ట్రయల్ దశలో ఉన్న ఈ బీఐటీవీ సేవలను.. కమర్షియల్ గా మార్చాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే బీఐటీవీకి సంబంధించిన ప్రీమియం ప్యాక్ ను ప్రకటించింది.

ప్రీమియం ప్యాక్ సమాచారం
బీఐటీవీ ప్రీమియం పాక్‌ను 2025 ఆగస్టు 28న లాంచ్ చేశారు. ఇది బీఎస్ఎన్ఎల్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్యాక్ ప్రకారం ప్రతి నెలా రూ.151 చెల్లిస్తే 25+ OTT యాప్‌లు (Aha, ZEE5, SonyLIV, Shemaroo, Sun NXT, Chaupal, Lionsgate Play, ETV Win, Discovery, Epic ON మొదలైనవి), 450+ లైవ్ టీవీ ఛానెళ్లు, మూవీస్, వెబ్ సిరీస్, రీజియనల్ కంటెంట్ (తెలుగు సహా) బీఐ టీవీలో పొందవచ్చు. ఈ ప్లాన్ డీటెయిల్స్ కోసం BSNL కస్టమర్ కేర్ (1503) లేదా సెల్ఫ్‌కేర్ యాప్ చెక్ చేయండి.

ఇంకా చవకైన ప్లాన్‌లు కూడా
టెలికాం టాక్ (TelecomTalk) రిపోర్ట్ ప్రకారం.. BSNL మరో రెండు ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. అందులో ఒకటి రూ.28 ఎంటర్టైన్ మెంట్ ప్లాన్. ఇది 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండి.. 7 ఓటీటీలు (Lionsgate Play, ETV Win, VROTT, Premiumflix, Nammflix, Gujari, Friday)లు అందిస్తుంది. అలాగే 9 కాంప్లిమెంటరీ ఓటీటీలు, లైవ్ టీవీ యాక్సెస్ ఈ ప్లాన్ లో రానుంది. మరొక రూ.29 బడ్జెట్ ప్యాక్ ను కూడా బీఐ టీవీ ఆఫర్ చేస్తోంది. ఇది 4 OTT ప్లాట్‌ఫామ్‌లు (ShemarooMe, Lionsgate Play, Dangal Play, VROTT), లైవ్ టీవీ యాక్సెస్ కు అనుమతిస్తుంది.

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధ నౌకను.. డ్రోన్ దాడితో పేల్చేసిన రష్యా.. వీడియో వైరల్

మరి నెట్ ఫ్లిక్స్, అమెజాన్?
బీఐ టీవీ ప్రకటించిన ప్రీమియం ప్యాక్ లో ఒక ప్రధానమైన సమస్య ఉంది. ప్రస్తుతం ఓటీటీలో ప్రధాన ఫ్లాట్ ఫామ్స్ గా ఉన్న నెట్ ఫ్లిక్ (Netflix), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime,  జియో హాట్ స్టార్ (Jio Hotstar) వంటి వాటిని ఇది ఆఫర్ చేయడం లేదు. ఇది బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. అయితే తెలుగువారికి మరింత చేరువైన జీ తెలుగు, సోనీ లైవ్, ఈటీవీ విన్, సన్ నెక్స్ట్ మాత్రం ఈ ప్యాక్ లో వస్తుండటం కాస్త సంతోషాన్ని కలిగించే అంశం. అయితే ప్రీమియం ప్యాక్ ను లాంచ్ చేసినప్పటికీ అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంలో మాత్రం బీఎస్ఎన్ఎల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధ నౌకను.. డ్రోన్ దాడితో పేల్చేసిన రష్యా.. వీడియో వైరల్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం