Dharmapuri Heavy Rains( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Dharmapuri Heavy Rains: భారీ వర్షాలు.. ధర్మపురిలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి

Dharmapuri Heavy Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో జగిత్యాల జిల్లా(Jagtial District) ధర్మపురిలో గోదావరి(Godavari in Dharmapuri) నది ప్రవాహం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్టు నుండి గోదావరి నదిలోకి నీటినీ విడుదల చేయడంతోపాటు గోదావరి నది ఎగువన కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ధర్మపురి వద్ద ఉధృతి తీవ్రం అయ్యింది. నది తీరంలోని సంతోషిమాత ఆలయంలోకి వరద నీరు చేరింది. శ్రాద్ధం మండపం నీట మునిగిపోయింది. నదితీరంలోని గోదావరి మాత ఆలయం దాటి వరద గంట గంటకు వరద ఉదృతి తీవ్రం అవుతుంది.

 Also Read: Virender Sehwag: ఆ ముగ్గురు గేమ్ ఛేంజర్లు.. టీమిండియాపై సెహ్వాగ్ తొలి స్పందన

హనుమాన్ల గడ్డ హనుమాన్ ఆలయం చుట్టూ గోదావరి ప్రవాహం చుట్టుముట్టింది. స్మశానవాటికలు నీటిలో మునిగిపోయాయి. స్థానిక పోలీస్ అధికారులు స్పందించి గోదావరి తీర ప్రాంత ప్రజలను నదిలోకి వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. తీరంలోని చిరు వ్యాపార సంస్థలను మూసి వేయించినారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా ధర్మపురి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు గోదావరి తీరంలో పర్యటిస్తూ భక్తులను…ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృష్ట్యా జగిత్యాల జిల్లా(Jagtial District) ధర్మపురి గోదావరిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎదుగు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో భారీగా వరద పెరిగింది. వరద దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించా మన్నారు.

గత 15 రోజులుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వరదపై రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజా ప్రతినిధులకు తగిన సూచనలు చేస్తూ ముందు జాగ్రత్త చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు, పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. అధికారులకు తీర ప్రాంత ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.

 Also Read: Rythu Bharosa Scheme: రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు