Rythu Bharosa Scheme (imageccredit:twitter)
తెలంగాణ

Rythu Bharosa Scheme: రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

Rythu Bharosa Scheme: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టు బడి సహయం అందించేందుకు, వారికి ఆర్ధిక స్థిరత్వాన్ని రైతులకు మెరుగు పరచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోస పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం కింద అర్హులైన వారికి ప్రతి ఎకరానికి సంవత్సనికి 12000 రూపాయలను రైతులకు పెట్టబడి ఆర్ధిక సహయం కింద అందిస్తుంది. రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు సహయం అందిస్తుంది. ఈ ఆర్థిక సహయాన్ని మోత్తం రైతు ఖాతాలో రెడువిడతలుగా అందిస్తుంది. భూబారతి (ధరణి పోర్టల్) ల్లో నమొదై ఉండి వ్యవసాయానికి యోగ్యమైన భూమికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కోంటుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములకు మినహ, ROFR పట్టాదారులను కూడా ఆ ఈ పథకానికి అర్హులుగా పరిగనించిది. అయితే కొత్తవాల్లు సైతం ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఉండాల్సన అర్హతలేమిటి..? ఈ వార్తలో తెలుసుకుందాం..

రైతు భరోసా పథకం

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టు బడి సహయం అందించేందుకు, రైతుల ఆర్ధిక స్థిరత్వాన్ని మెరుగు పరచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో 2018 సంవత్సరంలో రైతు బందు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. మొట్టమొదట ఈ పథకం ప్రవేశ పెట్టినప్పుడు రాష్ట్రంలో రైతులకు ప్రతి ఎరానికి 8000 ను రెండు దఫాలుగా ఇచ్చేవారు. తరువాత మల్లీ దీనిని 10000 వేలకు పెంచారు. గత ప్రభుత్వం తరువాత.. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని 2025లో రైతు బందు పథకాన్ని రైతు భరోస పథకంగా మార్చారు. రైతులకు పెట్టుబడి ఆర్థిక సహయం కింద 12000 రూపాయలను అందిస్తంది. ఖరీఫ్, రభీ సీజన్ లో 6000 చోప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తం డబ్బును రైతు ఖాతాలో జమచేస్తుంది.

ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు..

రైతులకు పెట్టుబడి కోసం ఆర్దిక సహయాన్ని అందించండం, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచి రైతులకు భరోస కల్పించడం చేస్తుంది. వ్యవసాయ రంగంలో ప్రస్తుత కాలానికి అనుకూలంగా ఆధునిక పద్దతిలో వ్యవసాయాన్ని చేసేలా రైతులను ప్రోస్తహించడమే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

Also Read: KTR on CM Revanth Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు?

రైతు భరోస పథకానికి కావాల్సిన అర్హతలు..?

1. తెలంగాణ రాప్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి

2. కనీసం రైతు వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

3. వ్యవసాయం చేయడానికి సరిపడా యోగ్యమైన భూమి కలిగి ఉండాలి. ఆ భూమి ధరణి పోర్టల్‌లో నమోదు చేసి ఉండాలి.

4. ROFR(Recognition of Forest Rights) పట్టాదారుల కూడా ఈ పథకానికి అర్హలుగా ప్రభుత్వం పరిగనిస్తుంది.

5. సాగుకు యోగ్యంకాని బీడు భూములు, రాల్ల భూములు, కొండలు, రియలస్టేట్, కాల్వలు, వెంచర్లు, వానిజ్యసముదాయానికి చెందిన భూములను రైతు భరోస పథకానికి అర్హులు కారు.

ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

అయితే గతంలో రైతుబందు పథకం ద్వారా లబ్ధిపొందిన రైతులు మల్లీ దీనికి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. దీనికి కొత్తగా అప్లై చేసుకునేవారు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి లేదు. రైతులు స్తానిక మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదంటే క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుది. పట్టదారుని పాసు బుక్కు, అతని బ్యాంకు ఖాతా పుస్తకం (జీరాక్స్ కాపీలు), మరియు రైతు మోబైల్ నెంబర్ ఇచ్చి ఆ అధికారికి ఇచ్చి దరఖాస్తు ఫారం నింపి ఇస్తే అధికారులు దాన్ని పైకి పంపంచి ప్రభుత్వం నుండి ఈ పథకం ద్యారా వచ్చే లబ్ధిదారుల జాభితాలో చేర్చుతారు. అనంతరం ఈ పథకానికి అర్హతలు పోందవచ్చు.

Also Read: Sand Mining Scam: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు