Sand Mining Scam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుక దందా(Sand scam) మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా జోరుగా కొనసాగుతుంది. సంబంధిత అధికారులు కుర్చీలకే పరిమితం కావడతో అడ్డు అదుపు లేకుండా కిన్నెరసాని(Kinnerasani) వాగే ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కూపన్లు ఉన్నాయంటూ జీరో దందా కొనసాగిస్తున్న కేటుగాళ్లు, గత ప్రభుత్వం బీఆర్ఎస్(BRS) పాలనలో మన ఇసుక మన వాహనాల ద్వారా ఇసుక వినియోగదారులకు నేరుగా మైనింగ్ శాఖ అధికారి పర్యవేక్షణలో ఆన్లైన్ డిడి(DD) విధానం ద్వారా జీరో ఇసుక దందాకు చెక్ పెడుతూ గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేసి పంచాయతీలకు మరియు వ్యవసాయ కూలీలకు కొంత ఆదాయాన్ని కల్పించేవారు.
Also Read: War 2 vs Animal: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘యానిమల్’ రికార్డును బద్దలుగొట్టిన ‘వార్ 2’
అధికారులు మౌనం
ఇప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Homes) పేరుతో కూపన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ఇదే అదనంగా భావిస్తున్న ఇసుకసురులు అందిన కాడికి దోచుకుంటున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మన ఇసుక మనవాహనలను పున ప్రారంభించి, జీరో ఇసుక దందాను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అధికారులు మౌనం పాటిస్తుండడంతో ఇసుకసురుల వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఇసుక దందా సులభతరమై మండల వ్యాప్తంగా ఇసుక దందా జోరుగా సాగుతున్నట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు . నేటి ఇసుకసురులే రేపటి రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తటంతో ప్రజలు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారుల్లో మార్పు వచ్చి జీరో దందాను అరికట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుకసురులపై కొరడాజులిపించాలని మండల ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నారు.
Also Read: Cyberabad Women Security: 143 డెకాయ్ ఆపరేషన్లు.. పట్టుబడ్డ 70 మంది పోకిరీలు!
