Viral Video: బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. ముంబయిలోని మన్నత్ (Mannat) అనే ఖరీదైన ఇంట్లో ఆయన జీవిస్తుంటారు. ఆ ఇంటి విలువ రూ.200 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. అలాంటి ఇంటి ప్రాంగణంలో షారుక్ ఓ వీధి కుక్కకు చోటు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీధి కుక్కలపై ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో షారుక్ ఓ కుక్కకు తన నివాసంలో చోటు ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వీడియోలో ఏముందంటే?
ముంబయిలోని షారుక్ మన్నత్ బంగ్లా ముందు ఓ వీధి కుక్క ప్రశాంతంగా కూర్చొని నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్ సాగర్ ఠాకూర్ (Sagar Thakur) తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మన్నత్ లో రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయని.. అయినప్పటికీ కుక్కను ఎవరూ అక్కడి నుంచి పంపించలేదని అతడు పేర్కొన్నారు. అందుకే ఆ కుక్క చాలా ప్రశాంతంగా మన్నత్ లో ఉండగలుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వీధి కుక్కకు తన ఇంటి ప్రాంగణంలో చోటిచ్చిన షారుక్ పై అతడు ప్రసంసలు కురిపించాడు.
View this post on Instagram
Also Read: Viral Video: 10 వేల అడుగుల ఎత్తులో.. డీజే పెట్టుకొని.. యువతి రచ్చ రంబోలా!
వీధి కుక్కులకు ఆహారం సైతం..
మరో వీడియోను పోస్ట్ చేసిన సాగర్ ఠాకూర్.. షారుక్ ఖాన్ చేస్తున్న మరో మంచి పని గురించి తెలియజేశారు. షారుక్ ఇంటి సిబ్బంది ప్రతీ రోజు వీధి కుక్కలకు ఆహారం ఇస్తారని పేర్కొన్నారు. దీంతో షారుక్ ఖాన్ పై ఒక్కసారిగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వం కలిగిన మనిషి కాబట్టే షారుక్ అంత గొప్ప స్టార్ అయ్యారని పేర్కొంటున్నారు. షారుక్ తరహాలో మరికొందరు వీధి కుక్కలకు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రావాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా కుక్కలను సంరక్షించడంతో పాటు.. వాటి ద్వారా ఇంటికి రక్షణ ఏర్పరచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
Also Read: Plants: మనుషులకే కాదు.. మెుక్కలకూ ఆ ఫీలింగ్స్ ఉంటాయట.. అప్పుడవి ఏం చేస్తాయంటే?
మన్నత్ రీనోవేషన్ పనులు
ముంబయిలోని బాంద్రా సముద్రతీరానికి దగ్గరగా షారుక్ నివాసమైన మన్నత్ ఉంది. ఈ ఇంటిని మరింత సౌఖర్యవంతంగా మార్చుకునేందుకు షారుక్ రెనోవేషన్ వర్క్స్ చేయిస్తున్నారు. అప్పటివరకూ ముంబయిలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం.. పాలిహిల్ లోని విలాసవంతమైన అపార్ట్ మెంట్ కు షారుక్ తన కుటుంబంతో మారారు. ఇది నిర్మాత వషు భగ్నానీకి చెందిన ప్రొపర్టి కాగా.. ఆయన సంతానమైన నటుడు జాకీ భగ్నానీ, నిర్మాత దీప్షిఖా దేశ్‌ముఖ్‌తో ఒప్పందం కుదుర్చుకొని షారుక్ ఆ ఇంటికి షిప్ట్ అయ్యారు.