Heavy Rains (image CREDIT: SWETCHA REporter OR twitter)
నార్త్ తెలంగాణ

Heavy Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు

Heavy Rains: ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి (SP Dr. Shabarish) సూచనలు జారీ చేశారు. భారీ వర్షాలకు ప్రాజెక్ట్ నగర్ సమీపంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలను పునరావస కేంద్రానికి తరలించారు.ఈ పునరావాస కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి, వారితో మాట్లాడుతూ… ప్రజలంతా వర్షాలు తగ్గేవరకు పునరావాస కేంద్రాలలో మరియు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని వాళ్లలో ధైర్యం నింపారు.

అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తం చేస్తూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి విపత్కర పరిస్థితిలు వచ్చిన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లా పోలీస్(Police)  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా విపత్తు నిర్వహణ దళాల (DDRF) ను కూడా అందుబాటులో ఉంచారు.

 Also Read: Actor Madhavan: భారీ వర్షాల ఎఫెక్ట్.. లద్దాఖ్‌లో చిక్కుకుపోయిన మాధవన్.. ఎటూ కదల్లేని స్థితిలో..

భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,

భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్(Collector Advait Kumar) సింగ్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… అవసరమైతే తప్ప ప్రజలు బయటకి రాకూడదని తెలిపారు. వాతావరణ సూచన ల మేరకు జిల్లాలో  భారీ వర్షం సూచన ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, క్షేత్రస్థాయిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, సూచించారు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని చెప్పారు.

ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి

పట్టణాలు, గ్రామాలలో వర్ష సూచనలపై అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు విస్తృత ప్రచారం (టామ్ టామ్) సోషల్ మీడియా, స్థానిక వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించి అప్రమత్తత చేయాలన్నారు.ఎలాంటి పశు సంపద, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, లేకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక సమర్పిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమున్న చోట విపత్తుల నివారణ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని వివరించారు. జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులతో ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Ganesh Visarjan 2025: రెండో రోజు కొనసాగిన నిమజ్జనం.. పారిశుద్ధ్య కార్మికురాలు మృతి!

Harish Rao: రాష్ట్రంలో దీన స్థితికి చేరిన గురుకులాలు.. హరీష్ రావు ఫైర్

TSUTF Demands : టెట్ పై సుప్రీం తీర్పును పున:సమీక్షించాలని ఉపాద్యాయులు డిమాండ్!

CV Anand: సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపిన సీపీ ఆనంద్!

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..