Nano Urea: నానో యూరియా రైతు మిత్రుడు, పర్యావరణ సంరక్షకుడు అని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, ఇఫ్కో ఆధ్వర్యంలో చౌటుకూరు మండల కేంద్రం లోని రైతులతో నానో యూరియా వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న నానో యూరియా రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో నానో యూరియా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతోంది.
Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు
రైతుల జీవితాలను మార్చే సాంకేతిక ఆవిష్కరణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నానో యూరియా(Nano Urea) వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి, రైతులు(Farmers) నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. నానో యూరియా(Nano Urea) ప్రస్తుతం రైతుల(Farmers) జీవితాలను మార్చే సాంకేతిక ఆవిష్కరణగా నిలుస్తోంది అన్నారు. నానో టెక్నాలజీ ఆధారంగా తయారైన ఈ ఎరువు వాడకం వల్ల పంట దిగుబడులు పెరుగుతాయి, భూమి సారవంతం అవుతుందన్నారు., రైతుల(Farmers) ఖర్చులు తగ్గుతాయి అన్నారు.నానో యూరియా(Nano Urea) అనేది యూరియాను నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో తయారు చేసిన ఎరువు. సాధారణ యూరియా, నానో స్థాయిలో (20–50 నానోమీటర్ల పరిమాణం) మార్చి, స్ప్రే రూపంలో వాడేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jogulamba Gadwal: ఇంకెన్నాళ్లీ యూరియా కష్టాలు.. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న మహిళలు