Viral Video: హైదరాబాద్ కు వచ్చిన రష్యన్ పర్యాటకురాలు (Russian tourist) పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె హైదరాబాద్ మౌలిక సదుపాయాలు, స్కైలైన్ చూసి ఆశ్చర్యపోయింది. హైదరాబాద్ ను దుబాయితో పోలుస్తూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియోను చూసి హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ ప్రజలు గర్వంగా ఫీలవుతున్నారు. రష్యన్ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు కారణమైంది.
వీడియోలో ఏముందంటే?
రష్యన్ యువతి క్సేనియా (Ksenia).. భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ (Hitec City)లో ఆమె విహారించింది. అక్కడ ఆమె చూసిన దృశ్యాలను తన ఫోన్ లో చిత్రీకరించింది. దానిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘హబీబి, ఇది దుబాయ్ కాదు.. ఇది హైదరాబాద్’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. సూర్యస్తమయ సమయంలో హైటెక్ అందాలు చూపిస్తూ వీడియోలో ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. గాజు అద్దాలతో కూడిన బిల్డింగ్ లను చూసి నోరు అమాంతం తెరిచి షాక్ కు గురవడం వీడియోలో గమనించవచ్చు.
View this post on Instagram
Also Read: Trump Tariffs Impact: భారత్‌పై 50 శాతం సుంకాల బాంబ్.. రంగాల వారీగా ప్రభావమెంత?
నెటిజన్ల రియాక్షన్
‘దుబాయి కాదు.. హైదరాబాద్’ అంటూ రషన్ మహిళ పోస్ట్ చేసిన వీడియోను చూసి హైదరాబాద్ (Hyderabad) ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘బయట నుండి ఎవరైనా వచ్చి మన నగరాన్ని పొగడటం నిజంగా గర్వకారణం’ అని ఓ నెటిజన్ రాశారు. అయితే మరికొందరు ఈ వీడియోపై విభిన్నంగా స్పందించారు. ‘వీడియోలో చూపించిందంతా హైదరాబాద్ కాదు. ఇది నగరంలోని ఒక చిన్న అభివృద్ధి చెందిన ప్రాంతం మాత్రమే’ అని ఒకరు కామెంట్ చేశారు. మొత్తంగా ఈ వీడియో హైదరాబాద్ అభివృద్ధిని ప్రపంచానికి చూపించడమే కాకుండా నగరాన్ని ఎలా చూడాలో అనే అంశంపై కూడా స్థానికుల మధ్య చర్చను రగిలించింది.
Also Read: Indian Railway: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లు డైవర్షన్, మరికొన్ని రద్దు.. ట్రైన్స్ లిస్ట్ ఇదే!
న్యూయార్క్ తో పోల్చిన రజనీ
గతంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajani kanth).. హైదరాబాద్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’22 ఏళ్ల తర్వాత ఆ మధ్య హైదరాబాద్ కు షూటింగ్ కోసం వచ్చి చూశాను. నేను ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్ లో ఉన్నానా? అర్థం కాలేదు. జూబ్లీబిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయి’ అంటూ రజనీ చెప్పుకొచ్చారు. అప్పట్లో రజనీ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి చర్చ జరిగేలా చేసింది.